
నిజంగా మహిళలపై అంత ప్రేమ, అభ్యుదయ భావాలు ఉంటే సమంత స్పందించాలి కదా..! ఒక్క పోస్టర్ పైనే అంతగా కామెంట్ చేస్తే… మరి ‘మహిళలు పక్కలోకి పనికొస్తారు’ అన్న చలపతిరావు వ్యాఖ్యలపై ఇంకెంతగా స్పందించాలి? అంటే ఇక్కడ తనకు కాబోయే శ్రీవారు నాగచైతన్య నటించిన సినిమా గనుక, వివాదం సృష్టించడం ఇష్టం లేక సైలెంట్ గా ఉందా? అంటూ ఇండస్ట్రీ వర్గాలలోనూ సమంత తీరుపై పెద్ద చర్చే నడుస్తోంది.
ఆ మాటకు వస్తే… ఒక్క సమంత మాత్రమే కాదు, ఇటీవల “ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి ప్రసన్న అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరి చలపతిరావు ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో పక్కనే ఉన్న రకుల్, నాగచైతన్యతో పాటు నవ్వుతూ కూర్చుంది తప్ప, ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా స్పందించ లేకపోయింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… తమ తమ సినిమాలకు వచ్చేపాటికి ఎన్ని ‘అన్ సెన్సార్డ్ గానీ, అభ్యంతరకర వ్యాఖ్యలు గానీ, మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు గానీ చేసినా వాటిని పట్టించుకోరు. అదే పక్క సినిమా దగ్గరికి వచ్చేసరికి పోస్టర్లపై కూడా అభ్యంతరాలు చెప్తుంటారు. ఇది మన తెలుగు టాప్ హీరోయిన్ల మహిళా అభ్యుదయ భావాలు… ఆదర్శమైన ఆలోచనలు..!
బహుశా మున్ముందు ఇతర సినిమాలలో నిజంగా మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నా, ఇలాంటి ఆడియో వేదికలపై అలీ లాంటి వారు అభ్యంతరకంగా స్పందించినా… ఈ హీరోయిన్లు స్పందించడానికి నిజంగా అర్హత ఉందా? ఎవరికీ వాళ్ళకు స్వార్ధం..! ఎదురింటిపై రాయి వేయడానికి మాత్రం ఎప్పుడూ రెడీగా కాచుకుని కూర్చునే వీరంతా విలువైన మహిళల హక్కుల గురించి మాట్లాడడం… కామెడీగా మారే విషయం..!
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…