
తాజాగా ‘పుష్ప’ నుండి ‘ఉ అంటావా ఉఊ అంటావా’ అంటూ స్పెషల్ సాంగ్ లో సమంత తళుక్కుమన్న విషయం తెలిసిందే. మాస్ అండ్ హాట్ లిరిక్స్ లో సమంత కనిపించడంతో, ఈ లిరికల్ సాంగ్ లోని స్క్రీన్ షాట్స్ తీసి సదరు సమంత ట్వీట్ కు రిప్లై ఇచ్చే పనిలో ఉన్నారు సూపర్ స్టార్ అభిమానులు.
నాడు సమంత ఏ పదజాలాన్ని ఉపయోగిస్తూ ట్వీట్ చేసిందో, నేడు అదే పదజాలంతో ట్వీట్ లు చేస్తూ ‘పుష్ప’లో మీ తీరు చూసి మేము కూడా చాలా హర్ట్ అయ్యాము అంటూ ‘జెస్సి’పై విరుచుకుపడుతున్నారు. ఫీలింగ్స్ మీకే కాదు, మాక్కూడా ఉంటాయంటూ ఈ ‘కుందనపు బొమ్మ’కు ఎనిమిదేళ్ల నాటి ‘ఫ్లాష్ బ్యాక్’ను గుర్తు చేస్తున్నారు.
నిజానికి ఈ దండయాత్ర ఇప్పటిది కాదు. ఏ మాత్రం సంబంధం లేకుండా సమంత రేపిన చిచ్చుకు సూపర్ స్టార్ అభిమానులు రివెంజ్ తీర్చుకుంటూనే ఉన్నారు. బహుశా “1 నేనొక్కడినే” చిత్ర యూనిట్ ఈ వివాదాన్ని అప్పుడే మరిచిపోయి ఉంటారు గానీ, ఫ్యాన్స్ మాత్రం మరువలేదని ఈ సందర్భంగా మరోసారి స్పష్టమవుతోంది. అందుకే త్రివిక్రమ్ అన్నారేమో… ఫ్యాన్స్ కు ఎమోషన్స్ మాత్రమే… లాజిక్స్ ఉండవు అని!
బహుశా సమంతకు బ్యాడ్ టైం నడుస్తుందో ఏమో గానీ, ఓ వైపు చైతూతో బ్రేకప్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుని మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోంది. బ్రేకప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనపడబోతున్న పాటగా ‘ఉ ఊ’కు ఓ క్రేజ్ ఏర్పడింది. దానిని కాస్తా సమంతకు చేదు అనుభవంగా మార్చే పనిలో మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు.
సూపర్ స్టార్స్ పై గానీ, వారి సినిమాలపై గానీ కామెంట్స్ చేయాలంటే… విమర్శలలో కాస్తైనా వాస్తవం ఉండాలి, లేదంటే ఇలాంటి అనుభవాలే చవిచూడాల్సి ఉంటుందని ప్రిన్స్ ఫ్యాన్స్ పదే పదే గుర్తు చేస్తూనే ఉన్నారు. ‘1 నేనొక్కడినే’ పోస్టర్ పై ఆ విధంగా కామెంట్ చేయడం పొరపాటని ఒప్పుకునే వరకు మహేష్ ఫ్యాన్స్ సమంతను వదిలిపెట్టరేమో!
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…