
‘మనం’ సినిమా నుండి ‘కింగ్’ నాగార్జున కూడా ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. మే 26వ తేదీన చైతూ నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా విడుదల కానున్న నేపధ్యంలో… మూడు రోజుల క్రితం నాగార్జున బావ (సోదరి భర్త) అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. దీని వలన సినిమానే వాయిదా పడుతుందని భావించిన నేపధ్యంలో… సినిమా కాదు గానీ ప్రీ రిలీజ్ వేడుకను రద్దు చేయగా, సినిమాను అనుకున్న సమయానికి మే 26వ తేదీనే విడుదల చేయబోతున్నారు.
అయితే బావ అకాల మరణంతో కృంగిపోయి ఉన్న అక్కినేని కుటుంబం తరపున “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా విడుదలకు ముందు, కాబోయే కోడలు సమంత కలియుగ దైవం దర్శనం చేసుకోవడం ప్రాధాన్యతను దక్కించుకుంది. అక్కినేని ఇంటిలో అడుగు పెట్టకముందే కుటుంబం తరపున సమంత బాధ్యతలు తీసుకుని, అందుకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాబోయే శ్రీవారి సినిమా విడుదల కదా… ఆ మాత్రం చేయడంలో వింతేముంది… అన్న మాటలు వినపడుతున్నాయిలేండి..!
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…