
ఇప్పుడు ఆడియన్స్ కి దీని గురించి తెలిశాక ఆ థీమ్ చుట్టే యశోదను అల్లుకోవడమనే ఆలోచన నిజంగా బాగుంది. కానీ అదొక్కటే సరిపోదుగా. చూస్తున్న వాళ్ళను కట్టిపడేసే స్క్రీన్ ప్లే కావాలి. మైండ్ బ్లోయింగ్ అనిపించే ట్విస్టులతో అదరగొట్టాలి. దీనికి మంచి ఉదాహరణగా 2012లో వచ్చిన బాలీవుడ్ మూవీ కహాని గురించి చెప్పుకోవాలి. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ టెర్రిఫిక్ డ్రామా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టు. ఎంతగా అంటే కేవలం సున్నితమైన సినిమాలు మాత్రమే తీసే శేఖర్ కమ్ముల ఇది చూసి మనసుపడి తెలుగులో అనామికగా నయనతారతో రీమేక్ చేసేంత. అఫ్కోర్స్ అంత గొప్ప దర్శకుడు హ్యాండిల్ చేసినా అది పోయిందనుకోండి
ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకంటే యశోదలోనూ అలాంటి స్కోప్ ఉంది. కానీ కమర్షియల్ ఆలోచనల్లో ఒక్కోసారి కొట్టుమిట్టాడే మన రచయితలు దర్శకులు దానికి లోబడి పోవడం వల్ల ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ల ట్విస్టులను కూడా వాడుకుంటారు. కొత్తదైనా పాతదైనా ఒక సినిమా తాలూకు జ్ఞాపకాలను మర్చిపోయేంత వీక్ మెమరీతో ఆడియన్స్ లేరు. అందుకే వెంటనే సదరు పాత సీన్లు టక్కున ఫ్లాష్ అవుతున్నాయి. ట్విస్టులు ఎక్కువ ఉంటే కథనం పండదు. దానికి సరిపడా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోడైతేనే థ్రిల్లర్స్ ని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. రాక్షసుడు అంత మంచి ఆదరణ పొందడానికి కారణం అదేగా. యశోదలో తగ్గింది ఇదే
సమంతా వీలైనంత తన భుజాల మీద సినిమాను మోసినా పల్లకిలో బరువు ఎక్కువవ్వడంతో తనకూ అది బరువైపోయింది. ఎందుకంటే ఇందులో హీరో లేడు. పాటలు రెండు పెట్టారు కానీ వాటి వల్ల ఉపయోగం నష్టం ఏదీ జరగలేదు. నవ్వించే అవకాశం దక్కలేదు. సీరియస్ గా చెప్పాలని నిర్ణయించుకుని దానికి తగ్గట్టే రాసుకున్నారు కానీ ఏదో అసంతృప్తి మనసులో కదులుతున్నా సామ్ వల్ల దాని మోతాదు తగ్గిందే తప్ప ఫైనల్ గా ఫుల్ మీల్స్ అనిపించలేదు. ఆ మధ్య నాగశౌర్య అశ్వద్ధామలోనూ ఇలాంటి పొరపాట్లే జరిగాయి. మొత్తానికి ఈ జానర్లో మనవాళ్ళు మెరుగుపడాల్సింది అయితే చాలా ఉంది. ఆషామాషీ కహానీలతో సూపర్ హిట్లు పడవు.
Following the terrible failure of Coolie, Rajinikanth made a comeback with his most anticipated sequel…
Every actor deserves to do a solo film. Unfortunately, there is a long list of…