
దీంతో సంపూ ఈ హౌస్ ను వీడి వెళ్లిపోయాడని అధికారికంగా బిగ్ బాస్ ఓ ప్రకటన చేసేసారు. అయితే నిజంగానే సంపూ బిగ్ బాస్ హౌస్ కు దూరమయ్యాడా? లేక ఇందులో ట్విస్ట్ లు ఏమైనా ఉన్నాయా? అంటే హిందీ బిగ్ బాస్ ను వీక్షించిన వారు మాత్రం ఖచ్చితంగా ఓ ట్విస్ట్ ఉండే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఎందుకంటే హిందీ బిగ్ బాస్ షోలో సీక్రెట్ రూంలో కొంత మందిని ఉంచి తరువాత మళ్లీ షోకు పంపిన సంగతి వీక్షించిన వారికి అవగతమే. దీంతో సంపూను కూడా ఇలాగే వినియోగించబోతున్నారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ హౌస్ లో పబ్లిసిటీ పరంగా పెద్ద సంచలనాలేవి నమోదు కాలేదు. హిందీ ఫార్మాట్ లో అయితే హౌస్ మేట్ల వ్యవహార శైలితో పలు వివాదాలు చోటు చేసుకుని, అవి తీవ్రమైన పోటీకి దారి తీసి, షోతో పాటు మీడియాకు కూడా సెన్సేషన్ గా మారుతాయి. అయితే ఇక్కడ మాత్రం తొలి వారం పూర్తై రెండో వారం ప్రారంభమైనా హౌస్ మేట్స్ మధ్య చిన్ని చిన్న అపార్థాలే తప్ప పెద్ద వివాదాలు రేగలేదు. సిగిరెట్ల వంకతో శివబాలాజీ చిందులేయడం, కెప్టెన్ కల్పన మాటలతో తన బాల్యంలో హాస్టల్ గుర్తుకొచ్చిందంటూ ముమైత్ ఖాన్ ఏడుపు, అనారోగ్యం బాధిస్తోందంటూ సంపూర్ణేష్ ఆందోళన మినహా బిగ్ బాస్ లో వివాదం ఏదీ రాలేదు.
దీంతో బర్నింగ్ స్టార్ ఎగ్జిట్ ను బిగ్ బాస్ ట్రంప్ కార్డ్ గా వాడబోతోందా? ఏమో ప్రస్తుతానికి తెలియదు గానీ, ఈ వీకెండ్ లో జూనియర్ ఎన్టీఆర్ వస్తే గానీ స్పష్టత రాదు. ఎలిమినేషన్ కావడానికి సంపూ పేరు నామినేషన్స్ లో లేకపోవడంతో సంపూ ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నది అసలు టాక్. అయితే తన ఊరి వారిని విడిచి ఇన్ని రోజులు ఉండలేడని చెప్పిన సంపూ, మళ్ళీ బిగ్ బాస్ షోకు వెళ్తారా? అందులోనూ అనారోగ్యకర పరిస్థితులలో అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…