
జక్కన్నతో పోల్చడం కాదు గానీ, నరసింహాచారి అలియాస్ సంపూర్ణేష్ బాబు చేసే కొన్ని సీన్లను కూడా ప్రేక్షకులు అలాగే అంగీకరిస్తున్నారు. బహుశా అవే సీన్లు వేరే హీరోలు చేస్తే… బండ బూతులు తిడతారేమో గానీ, సంపూ చేస్తే మాత్రం కామెడీగా చూస్తారు. సైన్స్ స్టూడెంట్ కూడా కాని ఓ వ్యక్తి కృత్రిమ హార్ట్ ను తయారుచేసినా… శివలింగం ముందు ఫోక్ డ్యాన్స్ వేసినా… ప్రేక్షకులు నవ్వుకుంటారు. ఆ క్రమంలోనే తాజాగా “వైరస్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల కాగా, ఇందులో సంపూ హీరోయిజం పక్కన పెడితే, బహుశా ఇవే డైలాగ్స్ ను ఇంకెవరైనా చెప్తే మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యేయి. కానీ, ఓవర్ యాక్షన్ తో కూడిన సంపూ నోట నుండి ఈ డైలాగ్స్ రావడం కామెడీగా మారినా, రొటీన్ గా ఇదే తరహా యాక్టింగ్ ను ప్రేక్షకులు ఎంతవరకు భరిస్తారనేది చూడాలి. ప్రతి సినిమాలోనూ ఇదే తరహా ఓవర్ యాక్టింగ్ ను చేస్తుండడంతో ఈ ‘వైరస్’ ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించదు.
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…