Telugu

కృష్ణాజిల్లాలో ఝాన్సీరాణికి వందనం… కాస్త జాగ్రత్త తల్లీ!

ఆనాడు ఝాన్సీరాణి పసిబిడ్డను వీపుకు కట్టుకొని బ్రిటిష్ వారితో పోరాడి భారతీయ మహిళల ధైర్యసాహసాలు లోకానికి చాటి చెప్పింది. నేటికీ మన దేశంలో అటువంటి వీరనారీమణులు కనిపిస్తూనే ఉంటారు. ఎక్కడో ఎందుకు… మన కృష్ణాజిల్లా, పామర్రు మండలంలోని పసుమర్రులో వీఆర్ఓ మీనా అటువంటి వీరనారే.

ఆ ప్రాంతంలో కొందరు అక్రమంగా మట్టి తవ్వితీసుకుపోయి ఇటుక బట్టీలకు అమ్ముకొంటున్నారు. అయితే వారందరూ అధికార వైసీపీకి చెందినవారో లేదా వారి బంధుమిత్రులో, వైసీపీ నేతల అనుచరులో కావడంతో ఏ అధికారి వారిని అడ్డుకొనే సాహసం చేయలేకపోతున్నారు.
కానీ వీఆర్ఓ మీనా తన పది నెలల చంటిబిడ్డను పెట్టుకొని స్కూటీ మీద మండుటెండలో లారీలను వెంబడించి అడ్డగించి వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేశారు. లారీలో మట్టి తరలిస్తున్న డ్రైవర్ ఆమెను “మేము ఎవరి మనుషులమో తెలుసా? లారీ ఎవరిదో తెలుసా?” అంటూ బెదిరించే ప్రయత్నం చేసినా ఆమె ఏమాత్రం భయపడకుండా లారీకి అడ్డంగా తన స్కూటీని పెట్టి ఎదురుగా నిలబడి కదలనీయకుండా చేశారు. దాంతో లారీ డ్రైవర్ లొంగిపోయాడు.

ADVERTISEMENT

రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు భయపడి అధికారులు మౌనంగా చూస్తుండిపోతుంటే ఓ మహిళా వీఆర్ఓ ఇంత ధైర్యంగా మట్టిని అక్రమంగా తరలిస్తున్న లారీలను అడ్డుకోవడం చూసైనా మిగిలిన అధికారులు ధైర్యం తెచ్చుకొని పనిచేస్తే ఈ ఇసుక, మట్టి, కొండలు, గుట్టల దోపిడీని అరికట్టవచ్చు. కానీ ఆవిదంగా చేయగల దమ్మున్న అధికారులు ఎంతమంది ఉన్నారు? పసుమర్రు వీఆర్ఓ మీనా చాలా ధైర్యం ప్రదర్శించారని అర్దమవుతూనే ఉంది. కానీ కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఆమె ధైర్యసాహసాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2 BO 2nd Day: Rajinikanth’s 1000 Crore Dream ON?

Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…

1 hour ago

Why Ramayan Release Crucial for Shah Rukh Khan’s King?

Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…

2 hours ago