
Sandeep Reddy Vanga’s playful comment about Sekhar Kammula’s heroes sparks social media reactions
సందీప్ రెడ్డి వంగా అంటే ఇప్పటివరకు ప్రేక్షకులకు కనిపించిన ఇమేజ్ వేరు. ఆయన మాటల్లో, కనిపించే తీరులో ఒక సీరియస్‌నెస్ ఉంటుంది. బలమైన అభిప్రాయాలు చెప్పే దర్శకుడిగానే ఎక్కువగా కనిపించారు.
అయితే తన చిన్న సినిమా రోమాంచకం ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి వంగాలో మరో సైడ్ బయటపడుతోంది. ఈవెంట్లలో జోక్స్ వేస్తూ, సరదాగా కామెంట్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన నిర్మించుకున్న సీరియస్ ఇమేజ్‌కు ఇది పూర్తి భిన్నంగా ఉంది.
రాత్రి Epic ప్రీ-రిలీజ్ ఈవెంట్ లోనూ అలాంటి సరదా కామెంట్ ఒకటి చేశారు.
“I don’t like Sekhar Kammula heroes, but I like his heroines.”
చూస్తే ఇది పూర్తిగా సరదాగా చేసిన వ్యాఖ్యే. కానీ సోషల్ మీడియాకు ఇలాంటి చిన్న కామెంట్ చాలు. వెంటనే చర్చ మరో వైపు వెళ్లిపోయింది.
శేఖర్ కమ్ముల అభిమానులు ఇప్పుడు సందీప్ వంగాని గట్టిగానే పట్టుకున్నారు. వంగా సినిమాల్లో హీరోలు టాక్సిక్‌గా ఉంటారని, హీరోయిన్లను బోల్డ్‌గా, స్లీజీగా చూపిస్తారని కౌంటర్ ఇస్తున్నారు. అలాంటి వంగా శేఖర్ కమ్ముల పాత్రలపై కామెంట్ చేయడమే పెద్ద ఐరనీ అంటున్నారు.
శేఖర్ కమ్ముల తన మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, తన పని విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటారు. పెద్దగా హడావుడి లేకుండా తన సినిమాలు చేసుకునే దర్శకుడు. అదే సమయంలో ఆయనను సైలెంట్ గా అభిమానించే ప్రేక్షకులు కూడా ఉంటారు.
ఈ మొత్తం చర్చలో శేఖర్ కమ్ముల మాత్రం ఎక్కడా లేరు. ఇకపై కూడా ఆయన స్పందించే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ చేయడం కానీ, వాటికి రియాక్ట్ అవడం కానీ ఆయన స్టైల్ కాదు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినా, తన తరఫున మాట్లాడే అభిమానులను శేఖర్ కమ్ముల సంపాదించుకున్నారు. సందీప్ వంగా సరదాగా చేసిన ఒక్క కామెంట్‌కు, శేఖర్ కమ్ముల ఒక్క మాట కూడా మాట్లాడకుండానే ఆయన అభిమానులు బదులిస్తున్నారు. ఈ మొత్తం చర్చలో ఆసక్తికరమైన విషయం అదే!
Shreyas Iyer will miss India’s upcoming ODI series against the West Indies. The reason is…
సరిగ్గా మూడేళ్ళ క్రితం ఇదే రోజున జగన్ ప్రభుత్వం టీడీపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది.…