
ముందుగా బన్నీ తమ వైకుంఠపురంలో సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించాడు. ఒక కోడి పుంజుని పట్టుకుని ఉన్న పోస్టర్ తో సంక్రాంతి బరిలోకి దిగాడు. ఈ ప్రకటన వచ్చిన గంటకే మహేష్ బాబు తన సినిమా సరిలేరు నీకెవ్వరూ కూడా అదే రోజున విడుదల అవుతుందని ప్రకటించాడు.
కనీసం కొత్త పోస్టర్ కూడా విడుదల చేయకపోవడంతో ఇది ఆదరాబాదరా చేసిన ప్రకటన అని స్పష్టంగా తెలుస్తుంది. జనవరి 12 ఆదివారం అంటే శనివారం అమెరికాలో ప్రీమియర్లు పడతాయి. సోమవారం, అయ్యాక పండుగ అడ్వాంటేజ్ వస్తుంది. దీనితో ఇద్దరికీ అదే డేట్ కావలి. మరి ఇద్దరిలో ఎవరు ఇప్పుడు వెనుతిరుగుతారో చూడాలి.
సహజంగా బన్నీ వెనక్కు తగ్గుతాడని అందరూ భావించవచ్చు. అయితే ఈ విషయంలో మాత్రం మొదట విడుదల తేదీని ప్రకటించి మోరల్ గా తనే ముందు వచ్చా అనిపించుకున్నాడు. అలవైకుంఠపురంలో సినిమాను త్రివిక్రమ్, సరిలేరు నీకెవ్వరు ను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.
Prabhas turned a casual conversation with Prashanth Neel into a fun moment, and fans got…
Ayushmann Khurrana and Sara Ali Khan’s Udta Teer has arrived in theatres on October 23,…