
ఆఫర్లు వస్తున్నాయి చేసుకుంటూ పోతున్నాడు తప్పించి ఎటొచ్చి కాలమే కలిసి రావడం లేదు. దానికి తగ్గట్టు రిలీజుల విషయంలో నిర్మాతలు పోటీ చూసుకోకుండా మరీ చూపిస్తున్న మొండిపట్టు ఇతని కనీస ఓపెనింగ్స్ ని దెబ్బ కొడుతున్నాయి. మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మధ్య కళ్యాణం కమనీయంని వదిలారు. ఎంత యూవీ బ్యానరైనా కేవలం ఆ బ్రాండ్ చూసి పొలోమని జనం థియేటర్లకు రారుగా. దెబ్బకు మార్నింగ్ షోకే సగం హాలు జనం లేక డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమన్నారు. డిజాస్టర్ మిగిలింది.
గత ఏడాది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రూపంలో ఆల్రెడీ ఒక సూపర్ డూపర్ ఫ్లాప్ మనోడి ఖాతాలో ఉంది. తాజాగా శ్రీదేవి శోభన్ బాబుతో శనివారం విడుదలకు రెడీ అయ్యాడు. ఒకపక్క ధనుష్ సర్ ని ఒక రోజు ముందే తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్ల వేసి ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నారు. మరోవైపు కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథకి నెల రోజుల నుంచి ఎడతెరపి లేకుండా పబ్లిసిటీ చేస్తూనే ఉన్నారు. కానీ వీటితో పోరుకి సై అన్న శ్రీదేవి శోభన్ బాబు నిమ్మకు నీరెత్తినట్టు ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఉంది.
ఈవెంట్ ఏదో చేశారని న్యూస్ పేపర్ చూస్తే కానీ జనానికి తెలియలేదు. పోనీ నిర్మాత ఎవరో కొత్త మొహం అనుకుంటే ఏదోలే అనుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల అన్ని తానై నిర్మించిన మూవీ ఇది. కనీసం మెగా ఫ్యాన్స్ కి ఇదొకటి తీశారన్న సంగతి కూడా తెలియనంత వీక్ గా వదులుతున్నారు. సినిమా బాగుందా లేదనేది తర్వాత సంగతి. కనీసం మంచి డేట్ కి వచ్చేలా చూసుకుంటే సంతోష్ శోభన్ లాంటి అప్ కమింగ్ హీరోలకు ఉపయోగపడుతుంది. ఇలా రాంగ్ టైమింగ్ వల్ల ప్రొడ్యూసర్ కి పెద్ద నష్టమేమీ లేకపోవచ్చు. కానీ రిస్క్ లో పడేది హీరో దర్శకుడితో పాటు దానికి పనిచేసిన బృందమే.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…