
అయితే డిసెంబర్ 9న ‘ధృవ’ విడుదల ఉండడంతో, ఇక ఇప్పట్లో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ విడుదలకు నోచుకోకపోవచ్చన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమయ్యింది. నిజానికి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆడియో విడుదల అయిన తర్వాత ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాకు భారీ ప్రచారం లభించింది. సినీ ప్రేక్షకుల్లో సైతం ఈ సినిమాను వీక్షించాలన్న కుతూహలం కలిగింది. ఆ ప్రభావమే ఏకంగా 2 మిలియన్ క్లిక్స్ ను ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ అందుకునే స్థాయికి వెళ్ళింది.
అయితే ఆ భారీ అంచనాలన్నింటిని నిలబెట్టుకోవడంలో చిత్ర యూనిట్ ఫెయిల్ అయ్యింది. ప్రత్యక్షంగా చిత్ర యూనిట్ కారణం కాకపోయినా, పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో వెనక్కి తగ్గడంతో, ప్రేక్షకుల్లో మునుపటి ఉత్సాహం, ఉత్సుకత లోపించాయి. ఈ లోపున మెగా వారసుడు సినిమా వస్తుండడంతో సాధారణంగానే పెద్ద సినిమాల వైపుకు ప్రేక్షకుల చూపు మళ్ళుతుంది. కానీ, డిసెంబర్ 23వ తేదీన ఈ పవర్ స్టార్ అభిమాని ధియేటర్లపై దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు.
బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయం మొదలుపెట్టిన సంగతి…
KVN Productions has quickly established itself as one of the ambitious production houses in South…