
తాజాగా కమెడియన్ సప్తగిరి రివ్యూలు రాసే వారిని దృష్టిలో పెట్టుకుని కీలక వ్యాఖ్యలు చేసారు. “తామంతా ఎంతో కష్టపడి సినిమా బాగా తీస్తే రివ్యూలు మాత్రం ప్రతికూలంగా రాశారంటూ” సప్తగిరి కన్నీళ్లు పెట్టుకున్నాడు. గత వారం విడుదలైన ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాకు సంబంధించి వివిధ రకమైన సినీ విశ్లేషణలు వెబ్ ప్రపంచంలో సందడి చేయడంతో… వాటిని దృష్టిలో పెట్టుకుని సప్తగిరి వ్యాఖ్యానించారు. అయితే తమ చిత్రం మాత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
హీరోగా తాను చేసిన తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని, దర్శకుడిని కావాలన్న లక్ష్యంతో సినిమాల్లోకి వచ్చిన తాను, నటుడిని అయ్యానని, ఎప్పటికైనా దర్శకత్వం చేస్తానని అన్నాడు. అయితే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి రీత్యా వచ్చిన రాబడి పోలిస్తే సక్సెస్ ఖాతాలో పడుతుందేమో గానీ, “సప్తగిరి ఎక్స్ ప్రెస్”కు మాత్రం సినీ విశ్లేషకులు, ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి.
రాజకీయాలలో ఎల్లప్పుడూ శత్రుత్వమే కాదు మర్యాదలు, సత్ సాంప్రదాయాలు, ఆనవాయితీలు కూడా పాటించడం అవసరం. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి,…
Social media was buzzing recently with news that Ranveer Singh bought the rights to Amish…