
“భయపడే వాడే బేరాలకు వస్తాడు… మనదగ్గర బేరాలేవమ్మా” అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్. “ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈసారి మొగుడొచ్చాడు” అంటూ మహేష్ బాబు గురించి ప్రకాష్ రాజ్ చివరన చెప్పే డైలాగు అదిరిపోయాయి. ఫ్యాన్స్ అయితే ఉబ్బితబ్బిబైపోతున్నారు. జనవరి 11న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.
సరిలేరు నీకెవ్వరు కేరళ షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ నెల 26 నుండి రామోజీ ఫిలిం సిటీలో ఒక పాట చిత్రీకరణ ఉంటుంది. డిసెంబర్ ఆరు లోగా మరో పాట షూటింగ్ కూడా పూర్తి చేస్తారు. దీనితో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్టే. సినిమాలో మహేష్ బాబు తొలిసారిగా ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారు.
అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనిల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన మొట్టమొదటి సారిగా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు.
13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. వరుసగా స్టార్ హీరోలందరూ దేవికి మొహం చాటేస్తున్నారు. దానితో ఈ చిత్రం ఆయనకు కీలకం కాబోతుంది.
Kajal Aggarwal had earlier said that she was playing a small role in Ramayana, but…
A car accident involving Meghana, daughter-in-law of former YSRCP minister Jogi Ramesh, has raised concerns…