Telugu

సరిలేరు నీకెవ్వరూ ట్రైలర్: ఫస్ట్ షో పడే దాకా ఆగాల్సిందే!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి విడుదల చేశారు. అయితే ట్రైలర్ మిక్సడ్ రెస్పాన్స్ రాబట్టింది అనే చెప్పుకోవాలి. రెండు నిముషాలకు పైగా ఉన్న ట్రైలర్ ని రెండు భాగాలుగా చేసి – ఫస్ట్ పార్ట్ కామెడీ మరియు రెండో పార్ట్ ని యాక్షన్ తో నింపేశాడు అనిల్.

అయితే యాక్షన్ పార్టు షరా మాములే…. కామెడీ చాలా సాదాగా అనిపించింది. కామెడీ ఎక్కువగా ట్రైన్ ఎపిసోడ్ లోదే ఉండడం దానికి ఇప్పటికే చాలా హైప్ పెంచెయ్యడంతో సినిమాలో ఎలా ఉంటుంది అనేది చూడాలి. అయితే మైండ్ బ్లాక్ పాటలోని లుంగీ గెట్ అప్, ట్రైలర్ చివరిలో వచ్చే “చిన్న బ్రేక్ ఇస్తున్న తరువాత బొమ్మ బద్దలైపోద్ది,” అని డైలాగు ఫ్యాన్స్ కు ఊపునిచ్చేదిగా ఉంది.

ADVERTISEMENT

ట్రైలర్ లోలా కాకుండా కామెడీ వర్క్ అవుట్ అయితే మాత్రం అనిల్ మరో హిట్ సాధించినట్టే. ఎందుకంటే మహేష్ బాబు ఫాన్స్ ఈ మధ్య తమ హీరోని ఇంత ఎనర్జిటిక్ క్యారెక్టర్ లో చూడలేదు. వారి ఆకలి ఈ సినిమాతో తీరిపోవచ్చు. అయితే అది జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే సినిమా మొదటి షో వరకూ ఆగాల్సిందే.

సరిలేరు నీకెవ్వరూ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 11న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన మొట్టమొదటి సారిగా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. కొంత గ్యాప్ తరువాత బండ్ల గణేష్ కూడా ఈ సినిమాలో తిరిగి నటిస్తున్నాడు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bandi Sanjay’s Son Faces Heat After CM’s Intervention

Union Minister and Karimnagar MP Bandi Sanjay’s son Bandi Bhageerath had been in the news…

19 minutes ago

Trailer Talk: Poor Mix of Kabir Singh and Saiyaara?

The trailer for Dharma Productions' upcoming film Chand Mera Dil has been dropped and it…

39 minutes ago