Telugu

జైలు నుండి బయటకు రానున్న శశికళ?

త‌మిళ‌నాడులోని అధికార అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ సోద‌రుడి కుమారుడు టీవీ మహదేవన్ శనివారం నాడు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. తంజావూరులోని మహాలింగేశ్వర ఆలయ సంద‌ర్శ‌న‌కు వెళ్లిన మహదేవన్ గర్భగుడి ఎదురుగా పూజలు నిర్వహిస్తోన్న స‌మ‌యంలో గుండెపోటుతో అక్క‌డికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.

జయలలిత మృతి చెందిన అనంత‌రం మహదేవన్‌ పార్టీ ఫోరమ్‌ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన విష‌యం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు వ‌చ్చిన స‌మ‌యంలోనూ మ‌హ‌దేవ‌న్ ఆమె వెన్నంటే ఉన్నారు. జైలులో ఉన్న శ‌శిక‌ళ ఈ వార్త తెలుసుకొని త‌న మేన‌ల్లుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు స‌మాచారం. దీనికి అనుమతి లభిస్తే శశికళ జైలు జీవితానికి కొన్ని గంటలు ఉపశమనం లభించవచ్చు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi Is Finally Ready to Break Its Silence

Prabhas fans may finally start getting more updates about Fauzi from this month. Mythri Naveen…

37 minutes ago

Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?

After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…

1 hour ago