Telugu

న్యూ ట్విస్ట్ – ‘బాహుబలి’ని చంపడంలో ‘కట్టప్ప’ రోల్!

‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నకు సమాధానం కోసం సినీ ప్రియులంతా ఏప్రిల్ 28 వైపుకు చూస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పైన బాహుబలిని కట్టప్ప చంపిన మాట నిజమే. అయితే ఎందుకు చంపాడో కారణం మాత్రమే తెలియాల్సి ఉంది. కానీ, ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే… ఒక్క సిల్వర్ స్క్రీన్ పైన మాత్రమే కాదు, మరో చోట కూడా కట్టప్ప బాహుబలిని చంపేయబోతున్నాడు. దీనికి కారణం కూడా ఉంది. ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే…

‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్, గతంలో కావేరి నదీ జలాల కోసం కర్ణాటక – తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్లుగా రగులుతోన్న కావేరి జల వివాదంలో కన్నడ సంఘాల పట్ల చాలా చులకన భావనతో మాట్లాడారట. దీంతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ కారణం చూపిస్తూ… తాజాగా సత్యరాజ్ నటించిన ‘బాహుబలి 2’ను కర్ణాటకలో ప్రదర్శించే అవకాశమే లేదని, ఈ సినిమాను ఎట్టి పరిస్తితుల్లోనైనా అడ్డుకుని తీరుతామని కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు.

ADVERTISEMENT

ఇప్పటికే బెంగుళూరులో నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఈ సంఘం అధ్యక్షుడు జయన్న ఈ దిశగా ఓ ప్రకటన చేసారు. గతంలో కూడా ఈ సంఘం నుండి ‘బాహుబలి 2’ పట్ల ఇలాంటి భావనలు వ్యక్తమైనా, సినిమా విడుదల ముహూర్తం దగ్గరవుతుండడంతో… టెన్షన్ మరింతగా పెరుగుతోంది. దీంతో సిల్వర్ స్క్రీన్ పై ‘బాహుబలి’ చావుకు కట్టప్ప కారకుడు అవునో కాదో ఇప్పుడే చెప్పలేం గానీ, కన్నడ నాట మాత్రం ‘బాహుబలి 2’ చావుకు కారణం కట్టప్పేనని బల్లగుద్ది చెప్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mokshagna’s Fantasy Debut: Risky or Brilliant Strategy?

Nandamuri Mokshagna’s debut has been a long wait for Balakrishna fans. Now that Vassishta has…

16 minutes ago

Pics: Anjali Brings Bold Blue Saree Glamour

Anjali Prabhakaran brings a vivid burst of blue to this rooftop fashion story, blending traditional…

37 minutes ago