
[m9ad]
విడుదలకు ముందు ఉన్న పాజిటివ్ వైబ్, సినిమా రిలీజ్ తర్వాత కూడా ఉందా? అంటే ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యే విధంగా ఈ సినిమా ‘ఫస్ట్ టాక్’ వినపడుతోంది. కధలో ఎడమచేయి కాన్సెప్ట్ తప్ప, మిగిలినదంతా రొటీన్ రివేంజ్ స్టోరీగా తెరకెక్కడంతో, ప్రేక్షకులు ఆశించిన సరికొత్త కధ, కధనం కరువయ్యింది.
క్లైమాక్స్ లో వచ్చే చైతూ – మాధవన్ ల మధ్య సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలాగే ఈ ఇద్దరు హీరోలు కూడా తమ స్థాయికి తగ్గ ప్రతిభను స్క్రీన్ పై చూపించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ లుక్స్ పరంగా ఓకే అనిపించగా, ‘కార్తీకేయ’తో ఔరా అనిపించిన దర్శకుడు చందు మొండేటి స్థాయిలో ఈ సినిమాలో కొత్తదనం కనిపించకపోవడం ప్రేక్షకులకు రుచించని అంశం.
బాక్సాఫీస్ వద్ద సినిమాలేవీ లేకపోవడంతో, ఈ టాక్ తో “సవ్యసాచి” ఎంతవరకు రాణిస్తుందో వేచిచూడాలి. చైతూ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచిన “శైలజా రెడ్డి అల్లుడు” సినిమాను ఈ ‘సవ్యసాచి’ అధిగమిస్తుందో లేదో!? ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు చందుని హీరో చైతూ ‘ఈ సారి తేడా కొట్టదు కదా?’ అని ఎందుకు అడిగారో సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది.
స్థానిక ఎన్నికలు టీడీపీ, జనసేన మధ్య రాజకీయ చిచ్చుకి కారణంగా మారతాయని, ఆ మంటలో తాము చలి కాచుకుందామని వైసీపీ…
Ramayana and Godzilla Minus Zero are heading towards a November showdown, but the real battle…