
తాజా సమాచారం మేరకు ‘సిస్టర్ సెంటిమెంట్’ చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చైతూ అక్క పాత్రలో భూమిక నటిస్తుండగా, ఆమెకి జరిగిన అన్యాయానికి తమ్ముడిగా చైతూ ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధాన కథాంశమని తెలుస్తోంది. సినిమాకి హైలైట్ గా నిలిచేది కూడా ఈ అంశమని ట్రేడ్ టాక్.
నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, విలన్ గా కోలీవుడ్ కం బాలీవుడ్ హీరో మాధవన్ కనిపించనున్నాడు. ఇక రావు రమేష్ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. జూన్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…