
మెట్రో నగరాల్లో గతంలో కనీస నిల్వ 1,000గా ఉండేది. దాన్ని నేటి నుంచి రూ.5,000 చేసింది. అర్బన్ ప్రాంతాల్లో దీన్ని 3,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 2,000, గ్రామీణ ప్రాంతాల్లో 1,000కి పెంచేసింది. ఈ కనీస నిల్వలను ఉంచకపోతే ఆయా ఖాతాదారులపై ఒక నెలలో 20 నుంచి 100 వరకు జరిమానా విధిస్తుంది. ఏటీఎం చార్జీల విషయానికొస్తే… సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలలో ఐదు ఉచితం. ఆ తర్వాత ప్రతీ లావాదేవీపైనా 10 చెల్లించుకోవాలి.
వేరే బ్యాంకు ఏటీఎంలలో నెలలో మూడు దాటితే 20 చొప్పున ప్రతీ లావాదేవీపై చార్జీ పడుతుంది. కాకపోతే కొద్దిమంది ఖాతాదారులకు ఊరట కలిగించే విషయం ఏమంటే… ఖాతాలో 25,000 బ్యాలన్స్ ఉన్నవారిపై సొంత బ్యాంకు ఏటీఎంలలో ఎన్ని లావాదేవీలు చేసినా చార్జీలుండవని ఎస్బీఐ ప్రకటించింది. ఇక నెలలో సొంత బ్యాంకు శాఖలో నగదు జమలు మూడు దాటితే చార్జీలు పడతాయి. ఇలా ఖాతాదారుల నుండి స్టేట్ ఆఫ్ ఇండియా దోపిడీ చేస్తోందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…
Well, the inevitable has happened as the Telangana government under the leadership of Chief minister…