
ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు భారతదేశంలోని 14 భాషలలో వార్తాపత్రికలు, ప్రసార, డిజిటల్ వేదికల నుంచి ఈ డేటాని సేకరించినట్లు స్కోర్ ట్రెండ్స్ తెలిపింది. ఈ డేటా ప్రకారం… అనుష్క శర్మ ఇతర సెలబ్రిటీల కంటే మెండుగా 71.90 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. 50.43 స్కోరుతో ప్రియాంకా చోప్రా రెండో స్థానంలోనూ, 40.09 స్కోరుతో దీపికా పదుకునే మూడో స్థానంలోనూ, 31.78 స్కోరుతో కంగనా రనౌత్ నాలుగో స్థానంలోనూ నిలిచారు.
ఈ గణాంకాలు కచ్చితమైనవని సర్వే సంస్థ సహ వ్యవస్థాపకులు అశ్విని కౌల్ చెప్పారు. టాప్-10 సెలబ్రిటీల్లో చోటు దక్కించుకున్న ఇతర బాలీవుడ్ స్టార్లలో సన్నీ లియోన్, సోనం కపూర్, శ్రద్ధా కపూర్, విద్యాబాలన్, తాప్సీ పన్ను, మాధురీ దీక్షిత్ ఉన్నారు. విరాట్ కోహ్లి సతీమణి అయిన తర్వాత అనుష్క శర్మ రేంజ్ మరింతగా పెరిగిందనేది నెటిజన్ల మాట.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…