
ఐదేళ్ళ జగన్ పాలనతో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తుఫాను ప్రభావిత ప్రాంతాల మాదిరిగా మారిందంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించేయడమే కాకుండా, తన అరాచక పాలనతో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేందుకే భయపడేలా చేసి వెళ్ళిపోయారు. పైగా మళ్ళీ నేనే వస్తానంటూ అందరినీ భయపెడుతున్నారు కూడా. ఇటువంటి పరిస్థితిలో ఏపీకి పరిశ్రమలు రప్పించడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడి ‘బ్రాండ్ ఇమేజ్’ ఏపీకి శ్రీరామ రక్షగా నిలుస్తోందిప్పుడు. ఒకవేళ ఆయన కాకుండా మారెవరైనా ముఖ్యమంత్రి అయ్యుంటే పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చేవారో లేదో తెలీదు.
మంత్రి నారా లోకేష్ కూడా చొరవ తీసుకొని అందరితో మాట్లాడుతూ, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎదగాల్సిన కర్నూలుకి దశాబ్ధాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. జగన్ కర్నూలు న్యాయరాజధాని అంటూ సీమ ప్రజలను, ముఖ్యంగా కర్నూలుప్రజలను మోసం చేశారు. కానీ నారా లోకేష్ కర్నూలులో హైకోర్టు బెంచీ ఏర్పాటు చేస్తామని వాగ్ధానం చేశారు. త్వరలో ఏర్పాటు కాబోతోంది.
అయితే రాజధానిని త్యాగం చేసిన కర్నూలు జిల్లాకి ఇంకా న్యాయం చేయాల్సి ఉంది. అందుకే ఈసారి సిఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరూ కర్నూలు జిల్లాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఓర్వకల్లులో దేశంలో తొలి ‘డ్రోన్ హబ్’ ఏర్పాటుకి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఓర్వకల్లులోనే దేశంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది.
భారత్, జపాన్ దేశాలకు చెందిన రెండు కంపెనీలు కలిసి ఓర్వకల్లులో రూ. 14,000 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా మరో 10,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించనున్నాయి. దీనికి సంబందించి ఒప్పంద పత్రాలపై సంక్రాంతి పండుగ తర్వాత సంతకాలు చేయబోతున్నారు.
ఓర్వకల్లు పారిశ్రామికవాడలోనే నాచ్ కార్పొరేషన్ అనే సంస్థ రూ.1,035 కోట్ల పెట్టుబడితో డక్ట్ ఐరన్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. దీనిలో కూడా సుమారు వెయ్యి మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభించనున్నాయి.
ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు-నెల్లూరు జిల్లాల మద్య శ్రీ సిటీలో అనేక పరిశ్రమలు వచ్చాయి. త్వరలో మరిన్ని రాబోతున్నాయి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో కూడా పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో రాబోయే 5 ఏళ్ళలో సీమ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి. మళ్ళీ రాయలసీమకు పూర్వ వైభవం తధ్యం.
Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…
Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…