Telugu

ఎన్టీఆర్ పై ఈ యాంగిల్ లో ఎవరు చెప్పలేదుగా!

Senior ntr helped chalapathi raoవిశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌముడుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు చాలా గొప్పగా చెప్తుంటారు. అయితే అసలు ఎన్టీఆర్ ఏం చేసారని… అందరూ ఇంతలా ప్రశంసలు కురిపించడానికి అన్న సందేహం ఈ తరం ప్రేక్షకులకు కలుగక మానదు. అలాంటి ఉదంతాలను ప్రముఖ నటులు చలపతిరావు వంటి వారు వివరిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… ఇంతవరకు ఎన్టీఆర్ కు సంబంధించి ఎవరూ చెప్పని విషయాలను వెల్లడించారు.

ADVERTISEMENT

ఒక నటుడిగా ఉన్న తాను నిర్మాతగా మారింది ఓ డబ్బులు సంపాదించి పెట్టడానికి మాత్రం కాదని, నిజంగా అలా అయితే ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో ఎన్ని సినిమాలనైనా నిర్మించే వాడినని చెప్పారు. నిజానికి ఎన్టీఆర్ చాలామందికి ఖాళీ డేట్స్ ఇచ్చేసి, నిర్మాతలకు అమ్ముకోమని చెప్పేవారని, ఎవరైనా కష్టాలలో ఉంటే తన దగ్గరున్న డేట్స్ ను ఎంతోకొంతకు వారికి ఇచ్చేసి, వారిని లాభాలకు తన డేట్స్ ను అమ్ముకుని ఆ కష్టాలను తీర్చుకోమని చెప్పేవారని, అంత మంచి వ్యక్తి ఎన్టీఆర్ అంటూ చెప్పుకొచ్చారు.

ఒక పిల్ల పెళ్లి చేయాలని వచ్చిన వారికి కూడా తన డేట్స్ ఇలాగే ఇచ్చారని, తన చుట్టూ ఉన్న నలుగురు బాగుండాలని భావించే ఉన్నతమైన వ్యక్తిత్వతం గల వ్యక్తి ఎన్టీఆర్ అని, అందుకే గొప్ప స్థాయికి వెళ్ళగలిగారని, ఉరికే ఎవరూ ఉన్నతమైన స్థాయికి చేరుకోరని, ఎంత డబ్బున్నా కొందరు అలాగే ఉంటారని, కానీ ఎన్టీఆర్ అలా కాదంటూ వివరించారు. తాను కూడా ఎప్పుడూ డబ్బులు సంపాదించేయాలని సినిమాలు నిర్మించలేదని, అయితే ఆ తర్వాత జరిగిన ‘ఇంటర్నల్ పోలిటిక్స్’ రీత్యా సినిమాల నిర్మాణానికి దూరంగా జరిగానని తెలిపారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Romanchakam Review: U.S. Premiere Report

Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…

3 hours ago

Ravi Teja Gave More Confidence To Jr NTR?

Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…

7 hours ago