
జవాన్ ట్రైలర్ చూశాక ఆడియన్స్ కి బోలెడన్ని జ్ఞాపకాలు ఫ్లాష్ అయ్యాయి. చివర్లో షారుఖ్ ఖాన్ గుండుని చూసి శివాజీలో రజనీకాంత్ అలా తళుక్కున మెరిసినట్టు అయ్యింది. అప్పుడే పుట్టిన బిడ్డను చేతుల్లోకి ఎత్తుకుని జనాలకు చూపించే సీన్ బాహుబలి కాదంటే ఎవరూ నమ్మలేరు. సగం మాస్క్ పెట్టుకున్న హీరో ఫేస్ అచ్చం అపరిచితుడు విక్రమ్ ని ఒక్కసారిగా ఫ్లాష్ అయ్యేలా చేసింది.
మెట్రో ఫైట్ గురించి చెప్పుకుంటూ పోతే డాక్టర్ నుంచి పోకిరి దాకా ఎన్నెన్నో రెఫరెన్సులు. అట్లీది చాలా తెలివి. ముందు నుంచి అంతే. చక్ దే ఇండియా కాన్సెప్ట్ కి దళపతి హీరోయిజం జోడించి విజిల్ తీశాడు. విజయ్ కాంత్ క్షత్రియుడుని మార్చి తీసి తేరి అంటే పవన్ కళ్యాణ్ ముచ్చటపడి మరీ రీమేక్ చేసుకున్నాడు. అదిరిందిలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎన్ని వందల సార్లు చూసిందో లెక్క చెప్పడం కష్టం.
ఇవన్నీ బాక్సాఫీస్ హిట్లే. మాస్ కి నచ్చాయి. అంతే. అట్లీ అదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడు. వందల కోట్ల బడ్జెట్, షారుఖ్ ఖాన్ లాంటి హీరో దొరికితే ఇంకేముంది చెడుగుడు ఆడేయొచ్చు. జవాన్ విజువల్స్ చూస్తే అదే అనిపిస్తోంది. హీరో ఒక మంచి హంతుకుడు. ఏదో రివెంజ్ ప్లాన్ చేసుకున్నాడు. హీరోయిన్ పోలీస్ ఆఫీసర్. మధ్యలో ఒక విలన్. ఈ చెడుగుడు ఆటే జవానని అర్థమైపోయింది
అసలు సినిమాలో కొత్త కంటెంట్ ఉండకపోవచ్చు. ఆ మాటకొస్తే ముప్పై అయిదేళ్ల క్రితం వచ్చిన కమల్ హాసన్ ఖైదీ వేటనే అట్లీ జవాన్ గా మార్చాడన్న టాక్ చెన్నై మీడియా వర్గాల్లో ఉంది. భార్య హత్యా నేరం మీద తండ్రి జైలుకి వెళ్లి వస్తాడు. శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఖాకీ చొక్కా వేసుకున్న కొడుకే అడ్డం పడతాడు. ఇద్దరిదీ ఒకే పోలిక. జవాన్ ఈ లైన్ మీద సాగుతుందట.
ఇది నిజమైనా కాకపోయినా అట్లీ అంతటి ఘటికుడే. ఏది ఎలా చేసినా తీసినా అంతిమంగా ఇతని వల్ల నిర్మాతలు కోట్లలో లాభం పొందుతున్నారు. పబ్లిక్ కి అతను తీసినవి రొటీన్ మసాలాలే అయినా నచ్చేస్తున్నాయి. దీంతో భారీ కలెక్షన్లు చేతిలో పెడుతున్నారు. అసలు విజయ్ వరసగా మూడు సినిమాలు ఇవ్వడం వెనుక విజయ సూత్రం ఇదేగా. రాజా రాణి లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చిన అట్లీ ఒకవేళ అదే జానర్ కి కట్టుబడి ఉంటే ఇవాళ ఇంత పెద్ద మార్కెట్ ని సృష్టించేవాడు కాదేమో. మాస్ తాలూకు బలం ఇది.
BOTTOM LINE Average but Watchable Urban Comedy PLATFORM JioHotstar RUNTIME 1 Hour 73 Mins (4…
Nagarjuna’s upcoming film King 100 is currently planned as a Telugu film and not a…