
ఈ సిరీస్ చిత్రాల్లో సరికొత్త రీతిలో దొంగలు చోరీలకు పాల్పడితే… వారిని అంతే చాకచక్యంగా పట్టుకునే పోలీసుల కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ‘ధూమ్-4’ పేరిట రానున్న చిత్రంలో దొంగగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించనున్నాడని సమాచారం. ‘ధూమ్’లో జాన్ అబ్రహాం, ‘ధూమ్-2’లో హృతిక్ రోషన్, ‘ధూమ్-3’లో మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తమదైన శైలిలో రక్తి కట్టించి, ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.
మరి తాజాగా ‘ధూమ్-4’లో దొంగగా నటించనున్న షారూక్ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో భారీ మార్పు చోటుచేసుకుంది. ఇప్పటిదాకా వచ్చిన ‘ధూమ్’ చిత్రాల్లో దొంగలు వేరైనా… పోలీసు మాత్రం ఒక్కడే. అతడే చోటా బచ్చన్ అమితాబ్ బచ్చన్. అయితే తాజా సీక్వెల్ లో అతడికి గుడ్ బై చెప్పిన చిత్ర యూనిట్ అతడి స్థానంలో రణవీర్ సింగ్ ను ఎంపిక చేసింది. 2017 జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…