జగన్ కు బాబు పిచ్చి పట్టిందట..!

వైస్ షర్మిల మీడియా ముందుకు వస్తుంది అంటేనే వైసీపీ పులి, ఆ పులి పిల్లలు గడగడా ఒణికిపోతున్నారనే చెప్పాలి. మీరు ఒక్కటంటే నేను వందంటా అనే ధోరణిలో షర్మిల వైసీపీ పైన, జగన్ పైన ఒక రకంగా కురుక్షేత్ర యుద్ధమే చేస్తున్నారు. గత ఐదేళ్లుగా కెమెరా ముందుకు రాని వైస్ జగన్ ఎన్నికల సందర్భంగా పలు ఆంగ్ల ఛానెల్స్ లతో మాటామంతి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

అయితే అక్కడ వారు రాష్ట్రానికి సంబందిచినంత వరకు ఏ ప్రశ్న అడిగిన జగన్ మాత్రం తానూ నొక్కిన బటన్ల గురించే మాత్రమే బదులుస్తున్నారు. అలాగే తన సొంత చెల్లి షర్మిల, సునీత వైసీపీ పైన చేస్తున్న విమర్శల గురించి ప్రస్తావిస్తే అది బాబు పనే అంటూ నెపం చంద్రబాబు మీద నెట్టి మాట దాటేస్తున్నారు.

ADVERTISEMENT

జగన్ తన పైన చేసిన విమర్శల మీద స్పందించిన షర్మిల జగన్ కి మళ్ళీ తనదైన స్టైల్ లో ఒక రౌండ్ ఏసింది. నేను చంద్రబాబు చేతిలో కీలు బొమ్మగా మారానని, ఆయన తో చేతులు కలిపి పని చేస్తున్నానని, బాబు స్క్రిప్ట్ చదువుతున్నానని జగన్ చెపుతున్నాడు కదా, అందుకు సాక్ష్యంగా ఏ ఒక్క ఆధారాన్ని అయినా వైసీపీ చూపించగలదా..? బాబు చెపితేనే నేనిదంతా చేస్తున్నాను అంటున్న మీరు బాబు చెపితేనే వైసీపీ తరుపున 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసానా..?

బాబు చెపితేనే బై బై బాబు క్యాంపైన్ చేసానా..? దీనికి జగన్ సమాధానం చెప్పాలి అంటూ వైసీపీ సమాధానం చెప్పలేని ప్రశ్నల్ని సంధించారు షర్మిల. అలాగే పనిలో పనిగా FIR లో వైస్సార్ పేరు చేర్చడం మీద కూడా మరోసారి క్లారిటీ ఇచ్చారు. జగన్ ను ఈ కేసుల నుండి తప్పించాలనే ఉద్దేశంతోనే ఛార్జ్ షీట్లో వైస్సార్ పేరు చేర్చడానికి మూడుసార్లు కోర్టుల కెళ్లింది పొన్నవోలు సుధాకర్. ఈ విషయాలన్నీ తనకు చెప్పింది రాజకీయ మేధావిగా భావించే ఉండవల్లి అరుణ్ కుమారే అంటూ ఈ ఉచ్చులోకి ఉండవల్లిని కూడా ఇరికించారు షర్మిల.

వైస్సార్ పేరును FIR లో చేర్చిన పొన్నవోలు కు జగన్ తానూ ముఖ్యమంత్రి అయిన ఆరు రోజులలోనే అడిషనల్ ఎడ్వాకెట్ జనరల్ పదవి ఇచ్చిన మాట వాస్తవం కాదా..? అలాగే గతంలో వైస్సార్ చావులో రిలయన్స్ వారి హస్తం ఉంది అంటూ చెప్పిన జగన్, తానూ ముఖ్యమంత్రి కాగానే అదే రిలయన్స్ ఇండస్ట్రీ పెద్దలకు పదవులు కట్టబెట్టలేదా..? వివేకా హత్య వెనుక టీడీపీ కుట్ర అంటూ చెప్పుకొచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చలేదా..? వీటన్నిటికీ జగన్ సమాధానం చెప్పగలరా..?

రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తిన అందుకు బాబే కారణంటూ మాట్లాడుతున్న జగన్ ను చూస్తే ఆయన మానసిక స్థితి పై నాకు ఆందోళనగా ఉంది అంటూ మరో బాంబు పేల్చారు షర్మిల. తన తండ్రి చావుకు న్యాయం కావాలి అంటూ న్యాయపోరాటం చేస్తున్న సునీత వెనుక బాబే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను అంటూ మాట ఇచ్చి వెనకెళ్లారు అంటూ ప్రశ్నిస్తున్న న వెనుక బాబేనా.

అలాగే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ని కంట్రోల్ చేసేది బాబే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలను నడిపిస్తుంది బాబే అంటూ జగన్ చేస్తున్న విమర్శలు చూస్తుంటే జగన్ గారికి బాబు పిచ్చి పట్టినట్టుంది అంటూ జగన్ ఒక రకమైన హెలుజినేషన్ లో ఉంటున్నారు అంటూ జగన్ పైన తన విమర్శల స్థాయిని మరో లెవెల్ కి తీసుకు వెళ్లారు షర్మిల.

ఇంతమందిని కంట్రోల్ చేసే శక్తి ఉన్న బలమైన వ్యక్తిగా బాబుని చిత్రీకరిస్తున్నారు జగన్, అద్దం ముందు నిల్చున్నా జగన్ కు ఆ అద్దంలో కూడా బాబే కనపడుతున్నారేమో అంటూ పులి పులి అంటున్న జగన్ ను ఒక మానసిక రోగిగా అభివర్ణించారు షర్మిల. మరి షర్మిల విమర్శలకు వైసీపీ నేతలు కౌంటర్ వేసి మరికొన్ని తాడేపల్లి రహస్యాలు బయటకు తెస్తారా..? ఆలోచించుకోవాలి మరి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jana Sena’s 40% Seat Share: Bolisetti’s Clarification for M9

Jana Sena Party’s proposed seat share for Andhra Pradesh urban local body elections has triggered…

25 minutes ago

Kangana’s Big Comeback Hope: HC Rejects Ban Plea

Kangana Ranaut's upcoming film Queen Forever has become the subject of a legal dispute over…

45 minutes ago