Telugu

సాక్షి కి ‘వర్మ’ మీదున్న సానుభూతి ‘షర్మిల’ మీద ఉండి ఉంటే….

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కి నిన్న రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పిస్తూ ఆయనను గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్ గా ప్రకటించింది. దీనితో వైసీపీ పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ పేరును మరోసారి చర్చకు తెచ్చింది.

కూటమి పొత్తులో భాగంగా వర్మ తన పిఠాపురం ఎమ్మెల్యే సీటును జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసారని, అందుకు ప్రతిగా టీడీపీ ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తానంటూ హామీ ఇచ్చి ఇప్పుడు పవన్ కోసం ఆ హామీని కూడా తుంగలోతొక్కి వర్మకు అన్యాయం చేసి నాగబాబుకు న్యాయం చేస్తుందంటూ సాక్షిలో వర్మకు మద్దతుగా కథనాలు ప్రచారం చేస్తుంది.

ADVERTISEMENT

కేవలం పవన్ కళ్ళలో ఆనందం చూడడం కోసమే బాబు, వర్మకు వెన్నుపోటు పొడిచి చివరికి పిఠాపురం పార్టీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి కూడా వర్మను తొలగించారంటూ ముసలి కన్నీళ్లు కారుస్తుంది. అలాగే పనిలో పనిగా గతంలో టీడీపీ పై నాగబాబు చేసిన విమర్శలను మరోసారి తెరమీదకు తెచ్చి టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య రాజకీయ చిచ్చు పెట్టేందుకు సిద్దమయ్యింది.

అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మీద ఇంత సానుభూతి వ్యక్తం చేస్తున్న సాక్షి గతంలో జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు, వైసీపీ అధికారంలోకి తెచ్చేందుకు జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని ఒక మహిళగా రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలు చేసిన షర్మిల గురించి ఆలోచించదా.?

వైసీపీ గెలుపు కోసం, జగన్ ముఖ్యమంత్రి పీఠం కోసం షర్మిల పడ్డ కష్టానికి జగన్ ఇచ్చిన రాజకీయ చేయూత ఏమిటి.? షర్మిల అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనా అంటూ ఆమె పుట్టుకునే అనుమానిస్తూ, అవమానిస్తున్న సాక్షి వర్మ కోసం గళం విప్పడం అవకాశవాద రాజకీయం అనిపించుకోదా.?

2019 వైసీపీ గెలుపులో షర్మిల పాత్ర అత్యంత కీలకం అనేది జగమెరిగిన సత్యమే. మరి అటువంటి షర్మిలను ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం జగన్ వైసీపీ పార్టీకి దూరం చేసినట్టు.? వైసీపీ కోసం షర్మిల చేసిన కష్టానికి జగన్ దగ్గర దక్కిన ప్రతిఫలం ఏమిటి.?

చివరికి షర్మిల ఏపీ సరిదిహ్హులు దాటి తెలంగాణ వరకు వెళ్లాల్సిన పరిసరితులెందుకొచ్చాయి.? జగన్ తనకోసం తన పార్టీ కోసం శ్రమించిన సొంత తల్లి చెల్లి మీద కోర్టులో కేసులేందుకు వేసినట్టు.? ఇది వెన్నుపోటు కాదా.? అనే అనేక ప్రశ్నలకు సాక్షి బదులు చెప్పగలదా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Big Case Against EC Chief: What Is The SC Verdict?

Election commission chief Gyanesh Kumar had been facing a peculiar challenge as the people of…

11 minutes ago

Peddi, Paradise, Bhogi: Mass Formula Tiring Out Audiences

“Chi deenamma… akkada vaalaki Dorothylu, Baththalu, Modha Rathrilu, Bethalahem Kudumba Unit lu. Manakemo Peddilu, Paradiselu,…

41 minutes ago