Telugu

హీరో చేస్తే రొమాన్స్… హీరోయిన్ చేస్తే?

నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యల పుణ్యమని సోషల్ మీడియాలో మంచి లోతైన చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మహిళల ‘డ్రెస్ సెన్స్’ గురించి చర్చ కాసేపు పక్కన పెడితే, మహిళల విషయంలో సమాజం తీరు మారిందా? అంటే పూర్తిగా అవునని కానీ కాదని కానీ చెప్పలేము.

ఈ చర్చ సినీ పరిశ్రమలోనే మొదలైంది కనుక అక్కడే ప్రారంభిస్తే, నేటికీ మన సినిమాలలో ఒక హీరోకి ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉండటం చాలా సహజంగా భావిస్తాము. ఇంకా ఇద్దరి మద్య హీరో నలిగిపోతుంటే అది మహిళలతో సహా అందరూ మంచి వినోదంగానే చూస్తారు.

ADVERTISEMENT

ఇది సినిమా కనుక సినిమాలాగే చూసి వదిలేద్దాం. కానీ అదే ఒక హీరోయిన్ ఇద్దరు లేదా ముగ్గురు హీరోలతో రోమాన్స్ చేస్తే దానిని వినోదంగా చూపరు. ఎవరూ అలా చూడరు. అదొక అనైతిక వ్యవహరంగానే చూపిస్తారు. ప్రేక్షకులు కూడా అలాగే చూస్తారు. హీరో ఇద్దరు ముగ్గురితో రొమాన్స్ చేస్తే వినోదంగా చూసిన ప్రేక్షకులే హీరోయిన్ చేస్తే అక్రమ సంబంధం లేదా అనైతికమని భావిస్తారు. ఎందుకు?

సినిమాలలో హీరో, హీరోయిన్ల బట్టల విషయంలో కూడా ఇలాగే జగుతోంది కదా? హీరోకి సూటు, బూటు లేదా ఒంటి నిండా దుస్తులు వేస్తారు. కానీ హీరోయిన్‌కి?ఇద్దరి దుస్తులలో తేడా మాత్రమే కాదు…కెమెరా యాంగిల్స్‌లో కూడా చాలా తేడా ఉంటుంది కదా?

సినీ పరిశ్రమ మొదలైనప్పటి నుంచి హీరోలు హీరోయిన్ అందాలను పొగుడుతూనే ఉన్నారు. కానీ ఆమె వ్యక్తిత్వాన్ని లేదా తెలివితేటలను కాదు. అదే హీరోయిన్ అయితే హీరో మగతనం, వ్యక్తిత్వం, తెలివితేటలను పొగుడుతూ ఉంటుంది. ఎందువల్ల?

ఇప్పుడు మరో ఉదాహరణ: బస్సులో లేదా రోడ్డు మీద ఇద్దరు మగవాళ్ళు కొట్టుకుంటే అది వీరావేశంగా చూస్తారు. అదే ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటే? అందరూ వినోదంగానే చూస్తారు. ఎందువల్ల అంటే మహిళల విషయంలో సమాజం తీరు నేటికీ మారనందునే కదా?

అన్ని రంగాలలో పురుషులతో స్త్రీలు పోటీ పడుతున్నప్పటికీ, నాడు త్రేతాతయుగం నుంచి నేడు కలియుగం వరకు స్త్రీ పురుషుల మద్య ఈ అంతరం… సమాజపు దృష్టి కోణం ఒకేలా ఉందని చెప్పక తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

The Paradise Gets Positive Responses

Unlike the usual approach seen in recent times, the makers of The Paradise have chosen…

19 minutes ago

Jailer 2: Can Rajinikanth Break Tamil Sequel Curse?

Tamil cinema has not had a great run with big-ticket sequels. The first film works,…

24 minutes ago