
వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో శోభా డే పదాలతో ఆడుకున్నాడు. సాక్షి మాలిక్ మెడలో కాంస్య పతకం ‘శోభ’నిస్తే… సింధు స్వర్ణ పతకాన్ని ‘దే’ (‘దే’ అనే పదానికి, ‘డే’ అనే పదానికి రాతలో ఒకటే పదాలు) అంటోందని ట్వీట్ చేశాడు. ఇలాగే మరికొందరు ప్రముఖులు కూడా సదరు రచయిత్రిపై మండిపడగా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మాత్రం శోభాడే పేరు ఎత్తకుండానే… పదునైన వ్యాఖ్యలతో చేసిన విమర్శలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
‘మీరు ఖాళీ చేతులతో రావడం లేదు… పతకాలతో వస్తున్నారు. మీరు మెడల్ తీసుకుని వస్తుంటే మేము మీతో సెల్ఫీలు తీసుకుంటున్నాము. మీరు అతిగా మీ ప్రత్యర్థులనే కాదు, అతిగా వాగే వాళ్లను కూడా ఓడించారు. మీ చేతలతో పెన్నులను కూడా ఓడించారు’ అంటూ ఆయన సింధును ప్రశంసిస్తూనే, విమర్శకులకు చరకలంటించారు. ‘సింధు! మహిళా శక్తిని చాటావు…నిన్ను చూసి భారతదేశం గర్విస్తోంది’ అని అభినందించారు బిగ్ బీ.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…