
వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చొన్నా అడగకుండానే విస్తరిలో అన్నీ వచ్చి పడుతుంటాయి. అదేవిదంగా తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం బిఆర్ఎస్ నేతలకు కూడా అన్నీ అప్పనంగా లభించాయి. ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లించకపోయినా అధికారులు ఎవరూ వారిని అడిగే సాహసం చేయలేకపోయేవారు. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశంలో అన్ని రాష్ట్రాలలోను అధికార పార్టీ నేతల తీరు ఇలాగే ఉంటుందని అందరికీ తెలుసు.
తెలంగాణలో ప్రభుత్వం అంటే… వడ్డించేవాడు మారగానే, బిఆర్ఎస్ నేతలకు, వారి కొమ్ముకాసిన అధికారులకు కష్టాలు మొదలయ్యాయి.
ముందుగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. తగిలింది. ఆర్మూరు పట్టణంలో టిఎస్‌ఆర్టీసీకి చెందిన 7,000 గజాల స్థలంలో ఆయన కట్టుకొన్న జీ-1 మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్‌కు నిన్న విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కారణం రూ.2.5 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడమే.
ఆయన టిఎస్‌ఆర్టీసీకి రూ.7.23 కోట్లు లీజు బకాయిలు కూడా చెల్లించలేదు. ఇన్నేళ్ళుగా విద్యుత్ అధికారులు, టిఎస్‌ఆర్టీసీ అధికారులు వాటి కోసం ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ నిన్న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నప్పుడే షాపింగ్ మాల్‌కు విద్యుత్ నిలిపివేశారు. అప్పుడే టిఎస్‌ఆర్టీసీ అధికారులు కూడా అక్కడకు చేరుకొని లీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే షాపింగ్ మాల్‌ని జప్తు చేస్తామంటూ మైకులో చెప్పి మరీ వచ్చారు!
గురువారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అప్పుల గురించి ప్రశ్నించగా సుమారు 85-90 వేల కోట్లు అప్పులు తీసుకొన్నట్లు అధికారులు చెప్పడంతో, ఈరోజు పూర్తి వివరాలతో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిని సమీక్షా సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు.
మాజీ సిఎం కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు, ట్రాన్స్ కో, జెన్ కో సిఎండి ప్రభాకరరావు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని ఆమోదించవద్దని, నేడు జరిగే సమీక్షా సమావేశానికి ఆయనను కూడా హాజరుపరచాలని రేవంత్ ఆదేశించారు.
ప్రభుత్వం మారగానే చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు రాజీనామాలు చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోవడం కాదు… తమ హయాంలో లెక్కలు అప్పజెప్పి మరీ వెళ్ళాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించిన్నట్లు తెలుస్తోంది. కనుక బిఆర్ఎస్ నేతలకు, వారి అవినీతి, అనుచిత నిర్ణయాలకు కొమ్ముకాసిన ఉన్నతాధికారులకు ఇక కష్టాలు మొదలైనట్లే!
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…
Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…