ఇంగ్లండ్ తరపున 7 టెస్టులు, 27 వన్డేలలో ప్రాతినిధ్యం వహించిన 26 సంవత్సరాల జేమ్స్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇంత చిన్న వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడంటే దానికి బలమైన కారణం ఉండి ఉండాలి… కానీ అది బలమైన కారణం కాదు… అంతకు మించినది..!
గత వారం రోజులుగా ప్రాణాంతకమైన గుండె జబ్బు కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని.., ఇది నా జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయం… నా ప్రపంచం తల్లకిందులైంది… జీవన్మరణ పోరాటం చేస్తున్నాను…” అంటూ తను చికిత్స పొందుతున్న ఒక ఫోటోను షేర్ చేసుకుంటూ ట్వీట్ చేసాడు.
జేమ్స్ టేలర్ ఉదంతంతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ టీమ్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ తీవ్ర దిగ్భ్రాంతికి గురై, ఇది చాలా బాధాకరమని అభిప్రాయపడ్డాడు. జీవితం చాలా చిన్నది ప్రతి క్షణం ఆశ్వాదించండి… అంటూ టేలర్ ఇచ్చిన సందేశం క్రికెట్ అభిమానులను కలచి వేస్తోంది.



