
‘శభాష్ నాయుడు’ సినిమా షూటింగ్ లాస్ ఏంజెలెస్ లో జరుగుతున్న సమయంలో వీరిద్దరికీ విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన గౌతమి ఎంపిక చేసిన దుస్తులు శ్రుతిహాసన్ కు నచ్చలేదట. ఇదే విషయాన్ని గౌతమి ముఖం మీదే చెప్పేసిందట. దీంతో, ఇద్దరి మధ్య గొడవ ఏర్పడింది. ఈ వ్యవహారంలో కమల్ తన కుమార్తె శ్రుతిహాసన్ వైపే నిలబడ్డారని… ఇది గౌతమికి తీవ్ర ఆవేదన కలిగించిందని సమాచారం.
ఈ కారణంగానే కమల్ తో విడిపోవాలనే నిర్ణయానికి గౌతమి వచ్చి ఉంటుందని కోలీవుడ్ టాక్. గత రెండు నెలలుగా కమల్ కు దూరంగానే ఉంటున్న గౌతమి, తాజాగా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఏది ఏమైనా, కమల్ కు ఇది మూడో బ్రేకప్! మరో పక్కన, తన తండ్రి కమలహాసన్ తో గౌతమి విడిపోవడంపై హీరోయిన్ శ్రుతిహాసన్ స్పందించింది. ఇది వారిద్దరికీ సంబంధించిన వ్యక్తిగత విషయమని… ఇతరుల వ్యక్తిగత జీవితం, నిర్ణయాలపై తాను మాట్లాడనని, తనకు తన తల్లిదండ్రులు, చెల్లెలు అక్షర హాసన్ లే ముఖ్యమని స్పష్టం చేసింది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…