
శుబ్మాన్ గిల్ ను భారత క్రికెట్ బోర్డు ఆల్-ఫార్మటు కెప్టెన్ గా కన్సిడర్ చేస్తున్నా, చాలా మంది అభిమానులు దీనిని అంగీకరించటంలో ఇప్పటికి సుముకతగా లేరనే చెప్పాలి. ఇప్పటికే కెప్టెన్ గా వ్యవహరించి 2 టెస్ట్ సిరీస్ ల ను విజయవంతంగా పూర్తి చేసుకున్న గిల్ కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుందంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇంగ్లాండ్ వెళ్లి వారిపై సిరీస్ ను డ్రా చేసుకుని, సొంత గడ్డ పై విండీస్ ను చిత్తు చేసి 2-0 తో సిరీస్ నెగ్గినప్పటికీ, గిల్ కు కెప్టెన్ గా ఇంకా సరైన సవాల్ ఎదురవలేదు. కానీ, మరికొన్ని రోజుల్లోనే ఆ సవాల్ ‘ఆస్ట్రేలియా’ పేరిట గిల్ ను పలకరించనుంది. ఆసీస్ సిరీస్ కోసం నేడు భారత జట్టు ఆస్ట్రేలియా కు పయనమయిన విషయం తెలిసిందే.
అయితే, ఆస్ట్రేలియా వెళ్లి ఆసీస్ ను చిత్తుచేయటమనేది అంత సులువైన సంగతి కాదు. కేవలం బ్యాటింగ్ లేదా బౌలింగ్ తో ఆసీస్ ను ఓడించలేము, గిల్ నుండి ఇప్పటి వరుకు చూడని కెప్టెన్సీ టెక్నీక్స్ ఈ ఆస్ట్రేలియా సిరీస్ లో చూస్తే గిల్ ను కెప్టెన్ గా అనుమానించిన ప్రతి అభిమాని ప్రశ్నలకు సమాధానం దొరికినట్టవుతుంది.
ఇప్పటికే గిల్ 2 సిరీస్ ల కు కెప్టెన్సీ చేసినప్పటికీ ఆ 2 సిరీస్ లలో సీనియర్ స్టార్ ప్లేయర్స్ పెద్దగా లేరు. రాహుల్, జడేజా, బుమ్రా వంటి వారే ఆ జట్లలో సీనియర్స్. అయితే ఇప్పుడు మొట్ట మొదటి సారిగా తన ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ మరియు తన ఓపెనింగ్ పార్టనర్ మాజీ-భారత కెప్టెన్ రోహిత్ శర్మ లు ఆడనున్న జట్టును లీడ్ చేయనున్నాడు గిల్.
ఖచ్చితంగా గిల్ ఈ సిరీస్ లో ఈ ఇరువురి అనుభవాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియా జట్టు పై రోహిత్ మరియు విరాట్ ఇద్దరికీ అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉండటం విశేషం. అయితే ఈ సిరీస్ లో గిల్ మన భారత జట్టును ఎలా లీడ్ చేస్తాడో అని చూడటానికి ఎందరో భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ కఠినమైన ప్రశ్న కు గిల్ సమాధానం ఎలా ఉంటుందో అని..?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…