
వైసీపీ శవరాజకీయాలు చేసేందుకు మరో అవకాశం లభించింది. విశాఖపట్నం, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలంలో మంగళవారం అర్ధరాత్రి క్యూ కాంప్లెక్స్ పక్కన గోడ హటాత్తుగా కూలిపోవడంతో, దాని కింద నలిగి ఏడుగురు భక్తులు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన చందనోత్సవంలో పాల్గొనేందుకు ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ, వారి సౌకర్యార్ధం కొండ దిగువన గల సింహగిరి బస్టాండ్ నుంచి కొండపైకి వెళ్ళే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో కొత్తగా రూ.300 క్యూ కాంప్లెక్స్ నిర్మించారు. మంగళవారం రాత్రి భారీగా వర్షం కురవడంతో గోడనాని హటాత్తుగా భక్తులపై కూలిపోయింది.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకొని శిధిలాల తొలగించి, ఏడుగురు భక్తుల మృతదేహాలను వెలికితీశారు. మరో నలుగురు క్షతగాత్రులను దేవస్థానం సిబ్బంది కాపాడి కేజీహెచ్ (ప్రభుత్వాసుపత్రి)కి తరలించారు.
ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హారేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ తదితరులు హుటాహుటిన సింహాచలం చేరుకొని సహాయ చర్యలు పర్యవేక్షించారు.
స్వామివారికి ఏడాది పొడవునా పూసిన చందనం తొలగించే కార్యక్రమం చందనోత్సవం. కనుక స్వామివారి చందనం తొలగించిన తర్వాత నిజరూప దర్శనం చేసుకునేందుకు ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. మంగళవారం ఉదయం నుంచే వేలాదిగా భక్తులు క్యూలైన్లలో నిలబడ్డారు.
కనుక భారీగా పోలీసులను మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునప్పటికీ అనూహ్యంగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
సాధారణంగా తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి ప్రమాదాలు జరిగితే వెంటనే అక్కడ వాలిపోయి శవరాజకీయాలు చేస్తుంటారు. కనుక ఆయనకి మళ్ళీ పని బడినట్లే! ఆ తర్వాత కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరమర్శించే పేరుతో ఫోటో సెషన్ కూడా ఉంటుంది.
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రోజా వంటి వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ ఇంకా ‘పని’ మొదలుపెట్టలేదు. బహుశః టిఫినీలు, కాఫీల కార్యక్రమం పూర్తిచేసుకొని మొదలుపెడతారేమో?
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…