
‘సింగం 3’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో… ఇదే విషయాన్ని దర్శకుడు హరిని అడిగితే, ‘తనకు జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియదన్న’ షాకింగ్ కామెంట్స్ చేసినట్లుగా మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారంతో సదరు దర్శకుడిపై గుర్రుమనడం జూనియర్ అభిమానుల వంతవ్వగా, నెటిజన్లు మాత్రం కౌంటర్ ఇచ్చే పనిలో ఉన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ పై కూడా ఇలాంటి ఒక వార్తే హల్చల్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి వెలుగులోకి తీసుకువస్తున్నారు.
ఓ మీడియా చేస్తున్న ఇంటర్వ్యూలో… ‘చిరంజీవి గారి తర్వాత డ్యాన్స్ లు మీరే బాగా చేస్తారంటూ’ అని జూనియర్ ఎన్టీఆర్ ను అడుగుతున్న సందర్భంలో… ‘తనకు చిరంజీవి ఎవరో తెలియదంటూ’ బుడ్డోడు చాలా పెద్ద కామెంట్స్ చేశాడంటూ జరిగిన ప్రచారం టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో ఆ దేవుడికే తెలియాలి గానీ, అప్పట్లో అభిమానుల మధ్య జరిగిన రచ్చ తెలియనిది కాదు. సరిగ్గా ఇప్పుడు దర్శకుడు హరి – జూనియర్ ఎన్టీఆర్ ఉదంతంలో కూడా ఇదే జరిగిందని నెటిజన్లు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటిల్లో నిజమెంత ఉందంటారు..?
చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…