
19 సంవత్సరాలకే వివాహమైన సునీత వైవాహిక బంధం కేవలం పదేళ్ళ పాటే నిలిచింది. బాధ్యతారాహిత్యానికి తన భర్త కేరాఫ్ అడ్రస్ అని, పిల్లలను పట్టించుకోకపోగా, గాయనిగా తనకున్న పరపతిని వినియోగించుకుని, తనకు తెలియకుండా డబ్బులు తీసుకుని, తన ప్రతిష్టను దిగజార్చేవాడని కన్నీరు పర్యంతం కావడం బహుశా ఆమె అభిమానులను అవాక్కు చేసే విషయం.
ఇంటి బాధ్యత అంతా దగ్గరుండి చూసుకుంటున్నా… తన భర్తలో మార్పు రాకపోవడంతో… ఆయన ప్రభావం పిల్లల మీద పడకూడదన్న భావనతో పదేళ్ళ తర్వాత విడిపోయానని చెప్పింది. ఇప్పటికీ కూడా పిల్లలను కూడా పట్టించుకోడని, ఈ మానసిక ఒత్తిడి నుండి బయట పడడానికి నిత్యం మెడిసిన్ వాడుతున్నానని, తను విడాకులు తీసుకున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, తన భర్త అందుకు సిద్ధంగా లేడని తెలిపింది.
ఓ అందమైన గాయనితో రాజకీయ నాయకుడు యాష్కీని సంబంధాలు ఉన్న ప్రచారంలో తన పేరు రాసుకొచ్చారు అని వాపోయిన సునీత, అదే తన భర్త తన చెంత ఉంటే ఇలాంటి పుకార్లకు ఆస్కారం ఉండేది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఎన్నో సార్లు ప్రాధేయపడ్డాను… ఎన్నో సార్లు కన్నీటి పర్యంతం అయ్యాను… ఆయన మారతారన్న నమ్మకం తనకు లేదని చెప్పిన విషాదమైన సంఘటనలు సునీత అభిమానులను కలవర పెడుతున్నాయి.
బయట నుండి చూసే వారికి వెండితెర వెలుగుజిలుగుల జీవితం ఒక స్వర్గంలా కనపడుతుంది. కానీ, అలాంటి చోట ఇలాంటి తెరవెనుక వాస్తవాలు చాలా ఉంటాయన్న విషయం చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి. అందుకు సింగర్ సునీత జీవితం ఒక ఉదాహరణ మాత్రమే. సెలబ్రిటీ హోదాలో తమను ఎంతగానో ప్రేమించే అభిమానులకు, వారి తెరవెనుక జీవితం ఇంత విషాదంగా ఉంటుందని తెలిస్తే… ఆ సెలబ్రిటీ హోదాకు విలువ ఎక్కడుంటుంది? అందుకే చాలా మంది జీవితాలు అలా తెరవెనుకే మరుగున పడిపోతుంటాయి.
The interesting part of the Epic trailer launch was not just Vijay Deverakonda’s absence and…
Karthi is returning to the silver screen with the highly anticipated spy thriller Sardar 2,…