
ఈ వారం థియేటర్లలో రెండు చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. శ్రీ విష్ణు ‘సింగిల్’ తో వస్తుండగా, సమంత ప్రొడ్యూసర్ మరియు నటిగా ‘శుభం’తో వస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు సినిమా ట్రైలర్లు కొంత ఇంటరెస్ట్ అయితే కలిగించాయి.
శ్రీ విష్ణు ‘స్వాగ్’ లో ఐదు విభిన్న పాత్రలతో మంచి ప్రయత్నమే చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కలేదు. కానీ ఓటీటీ లో మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ఇపుడు ‘గీత ఆర్ట్స్’ బ్యానర్ లో ‘అల్లు అరవింద్’ ప్రొడ్యూసర్ గా ‘సింగిల్’ మూవీ మంచి కామెడీ ఎంటర్టైనర్ గా రిలీజ్ కి సిద్ధమైంది. ఇందులో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. శ్రీ విష్ణు నటనకు ఎప్పుడూ ప్రశంసలే వచ్చినా సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. ఈ సారైనా తనదైన ఎంటర్టైన్మెంట్ మార్కుతో హిట్టు కొడతాడేమో చూడాలి.
ఇక సమంత ప్రొడ్యూసర్ గా, గెస్ట్ పాత్రలో నటించిన సినిమా ‘శుభం’. ఈ హారర్-కామెడీ చిత్రం కూడా మే 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకి కొత్త దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువమంది కొత్త నటీ నటులు ఉండడంతో ప్రేక్షకులకు ట్రైలర్ అంతగా దగ్గర కాలేకపోయింది. తెలుగు ప్రేక్షకులు హారర్-కామెడీ చిత్రాలను ఆదరిస్తారు కాబట్టి, మంచి టాక్ తెచ్చుకుంటే సమంత ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
నాని ‘హిట్-3 మంచి ఓపెనింగ్స్ సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుంది. కానీ ఇది కేవలం హిట్ సిరీస్ నచ్చిన వారికే అన్నట్లు ఉండడం తో ఇపుడు ఫామిలీ మరియు నార్మల్ ఆడియెన్స్ కు ‘సింగిల్’, ‘శుభం’ సినిమాలు మంచి ఆప్షన్స్ గా ఉన్నాయి.
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…