స్మితా సభర్వాల్: ఈమెను ఎలా డీల్ చేయాలబ్బా!

తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పక్కలో బల్లెంలా మారడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పర్యాటక శాఖ కార్యదర్శిగా చేస్తున్న ఆమె కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ పోస్టుని రీట్వీట్ చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పెద్ద షాక్.

ఆ భూములలో జేసీబీల ఎదుట జింకలు, నెమళ్ళు దీనంగా నిలబడినట్లు బిఆర్ఎస్ పార్టీ, దాని సోషల్ మీడియా కార్యకర్తలు ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె వాటిని రీట్వీట్ చేశారు. అంటే తమ ప్రభుత్వం చేస్తున్న పని సరికాదని ఆమె చెప్పినట్లే!

ADVERTISEMENT

ఈ వ్యవహారంలో ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రభుత్వం తల బొప్పి కట్టేసింది. కనుక ఈ సమస్య నుంచి గౌరవప్రదంగా ఎలా బయటపడాలా?అని దారులు వెతుకుతుంటే, ప్రభుత్వంలో ఓ శాఖకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న స్మితా సభర్వాల్ తీరుతో కాంగ్రెస్‌ నేతలు తల పట్టుకొంటున్నారు.

అప్పటికీ.. ఆమెను మృధువుగా హెచ్చరించేందుకు గచ్చిబౌలి పోలీసులు రీట్వీట్‌పై వివరణ కోరుతూ నోటీస్ ఇచ్చారు కూడా. కానీ ఆమె మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఈ భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పుకి సంబందించి వచ్చిన వార్తని, తెలంగాణ పోలీసులు తమ ఐఏఎస్ అధికారి (తనకు) నోటీస్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ అనూష రవి సూద్ అనే మహిళ చేసిన ట్వీట్‌ని ఆమె రీట్వీట్ చేశారు.

కేసీఆర్‌ హయాంలో స్మితా సభర్వాల్ చాలా పాపులర్ ఐఏఎస్ అధికారిణిగా గుర్తింపు పొందారు. ఆమెకు కేసీఆర్‌ ప్రభుత్వంలో చాలా ప్రాధాన్యం లభించింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమెకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అనేక మంది ఐఏఎస్, ఐపీస్ అధికారులలో ఆమె కూడా ఒకరన్నట్లు ఆమెని పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమించింది.

కనుక ఆమె ఆ అసహనంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈవిదంగా ఇబ్బంది కలిగిస్తున్నారా?లేదా కేసీఆర్‌, కేటీఆర్‌ల సూచన మేరకు చేస్తున్నారా? లేదా ప్రభుత్వం చేస్తున్నది తప్పని గట్టిగా నమ్మినందునే ధైర్యంగా చెపుతున్నారా?అంటే అన్నీ అనుకోవాలేమో?

తగ్గేదేలే అని ఆమె స్పష్టం చేశారు కనుక ఇప్పుడు బంతి రేవంత్ రెడ్డి కోర్టులోనే ఉన్నట్లు భావించవచ్చు. ఆమెపై బదిలీ వేటు వేస్తారేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Egilivaranga From Bhogi: A Soulful, Lively Folk Song

Sharwa is coming up with the rural period action drama Bhogi. Directed by Sampath Nandi…

6 minutes ago

Katrina Kaif Has a Message for Social Media Critics

Katrina Kaif is in a new phase of life after becoming a mother, but her…

12 minutes ago