Telugu

జ్ఞాపకాలు – జయలలితపై శోభన్ బాబు ఏమన్నారో తెలుసా..!

జయలలితతో నటించినది కొన్ని చిత్రాలే అయినా, హీరో శోభన్ బాబుతో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని గతంలో శోభన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను నటుడిగా అవకాశాలు పొందే నాటికే జయలలిత పెద్ద స్టార్ అని, ఆమెతో నటించాలని ఎనిమిదేళ్లు ఎదురు చూశానని చెప్పుకున్నారు. ఆమెను చూడాలని తపించే వాడినని, ఓ రకంగా తపస్సే చేశానని గుర్తు చేసుకున్నారు.

1973లో తల్లిని కోల్పోయి, విషాదంలో ఉన్న జయలలితను తొలిసారిగా కలిశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన శోభన్ బాబు, ఆమెను మామూలుగా చేసేందుకు హుషారుగా జోక్స్ వేస్తూ నవ్వించేవారట. ఆ ప్రవర్తనే జయకు ఆయన్ను దగ్గర చేసింది. అమ్మ చనిపోవడంతో నా అన్నవారు లేక, బతుకుపై విరక్తిని పెంచుకుంటున్న దశలో, శోభన్ బాబుతో స్నేహం కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఈ విషయాన్ని జయలలిత తనతో చాలా సార్లు చెప్పిందని శోభన్ బాబు వెల్లడించారు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

After OTT Disaster Gandhari, Taapsee Blames Alia Bhatt?

Did the failure of Alia Bhatt’s Alpha end up affecting other female actors too? Taapsee…

9 minutes ago

KTR Following Jagan’s Track Before Election?

The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…

39 minutes ago