Telugu

శుభమాని చై-శోభిత పెళ్ళిచేసుకోబోతుంటే…

సినీ, రాజకీయ తదితర రంగాలలో ఉన్నవారు వాటిని పూర్తిగా వదిలేసినా మళ్ళీ వాటి గురించే ఆలోచిస్తుంటారు ఏదో ఓ సందర్భంలో వాటి గురించే మాట్లాడుతుంటారు.

ADVERTISEMENT

ఆ కోవకు చెందిన వ్యక్తులలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణూ స్వామి కూడా ఒకరు. శాసనసభ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గ్రహస్థితి ఏమీ బాగోలేదని, ఆయన ఎన్నికలలో ఓడిపోతారని వేణుస్వామి జోస్యం చెప్పారు. జగన్‌ జాతకం చాలా అద్భుతంగా ఉందని, ఆయనకు రాజయోగం ఉంది కనుక మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపడుతారని చెప్పారు.

కానీ అందుకు పూర్తి భిన్నమైన ఫలితాలు రావడంతో తప్పుగా అంచనావేసి మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణలు కోరారు. ఇకపై ఎన్నడూ రాజకీయ జాతకాలు చెప్పనని, ముఖ్యంగా ఎవరికీ వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించే విషయాలు మాట్లాడనని వేణుస్వామి చెప్పారు.

అంతటితో ఆయన అధ్యాయం ముగిసిపోయిందనే అందరూ అనుకున్నారు. కానీ ముందే చెప్పుకున్నట్లు ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నిన్ననే వివాహ నిశ్చితార్ధం చేసుకున్న నాగ చైతన్య, శోభిత దూళిపాళల జాతకాలను విశ్లేషించి వారు ఎక్కువకాలం కలిసి ఉండలేరని తేల్చి చెప్పేశారు!

“కెరీర్‌ పరంగా సమంత జాతకం 100 శాతం బాగుందని కానీ శోభిత జాతకం 20 శాతం మాత్రమే బాగుందని వేణు స్వామి చెప్పారు.

నాగ చైతన్య-సమంతల జాతకాల ప్రకారం వారికి తాను 50 మార్కులు వేశానని, కానీ నాగ చైతన్య-శోభిత దూళిపాళల జాతకాల ప్రకారం వారికి 10 మార్కులు మాత్రమే వేస్తున్నానని వేణుస్వామి చెప్పారు.

తాను 50 మార్కులు వేసిన నాగ చైతన్య-సమంతలే కాపురం చేయలేక విడిపోయినప్పుడు, 10 మార్కులు మాత్రమే పొందిననాగ చైతన్య-శోభిత దూళిపాళ ఎక్కువ కాలం కలిసి ఉండలేరని వేణుస్వామి చెప్పారు. మరో స్త్రీ మూలంగా వీరు విడిపోయే అవకాశం ఉందని వేణుస్వామి చెప్పదలచుకున్నవి చెప్పేసి, అలా జరుగకూడదని, తన జాతకం తప్పవ్వాలని కోరుకుంటున్నానని ముందు జాగ్రత్తగా ముక్తాయించారు.

చంద్రబాబు నాయుడు లేదా జగన్మోహన్‌ రెడ్డి లేదా నాగ చైతన్య మరొకరో ఆయన వద్దకు వెళ్ళి మా జాతకాలు ఎలా ఉన్నాయో చూసి చెప్పమని అడిగితే చెప్పినా తప్పులేదు. కానీ ఎవరూ అడగకుండానే ఆయన ఉచితంగా పెద్దలందరి జాతకాలు చెపుతుంటారు.

తన జోస్యం ఫలించినా, ఫలించకపోయినా ప్రముఖుల గురించి మాట్లాడుతుంటే బాగా పాపులర్ అవుతాననే విషయం వేణుస్వామి బాగానే గ్రహించిన్నట్లున్నారు. బహుశః అందుకే ప్రముఖులను టార్గెట్ చేసుకొని జాతకాలు చెపుతుంటారు. కానీ ఇదే కారణంగా ఏదోరోజు ఆయన జాతకమే వికటించే ప్రమాదం ఉందని గ్రహిస్తే మంచిదేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

DHS To Scrap Prior H-1B Deference? New Proposal Sparks Debate

The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…

3 hours ago

Big Films Coming But No Noise At All!

Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…

3 hours ago