
ఇప్పటికీ వైసీపీ వర్గాలు నారా లోకేష్ ను ఉద్దేశిస్తూ… సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కానీ, వారికి ఇంకా ఆ వీడియో అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే, తాజాగా మరో వీడియో వైసీపీ వర్గాలకు ఆయుధంలా మారింది. ఇటీవల కాలంలో కాస్త మార్పు కనిపించిన నారా లోకేష్ వ్యాఖ్యలు, తాజాగా అంబేద్కర్ ‘వర్ధంతి’ రోజు…. ఓ… అదేనండి అంబేద్కర్ ‘జయంతి’ రోజున చేసిన ప్రసంగంతో పాత రోజులను గుర్తుకు తెచ్చాయి. ఇప్పటికే అర్ధమై ఉంటుంది… నారా లోకేష్ ఎంతటి పొరపాటు చేసారో!
‘జోహార్ అంబేద్కర్ అంటూ… మీ అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు’ అన్న నారా లోకేష్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంబేద్కర్ జయంతి రోజున నారా లోకేష్ నెటిజన్లకు ఇచ్చిన కానుకగా ఈ వీడియో మారిపోయింది. ఒక్క వైసీపీ వర్గాలే కాదు, సోషల్ మీడియాలో ఉండే సాధారణ నెటిజన్లు కూడా ఈ వీడియోను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు. ప్రముఖ వ్యక్తుల నుండి చిన్న పొరపాటు తలెత్తితే, ఏ రేంజ్ లో ఆడుకోవాలో నెటిజన్లకు తెలిసినంతగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీలకు కూడా తెలియవని చెప్పడంలో సందేహం లేదు.
Prabhas fans may finally start getting more updates about Fauzi from this month. Mythri Naveen…
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…