
జగన్ పాదయాత్రకు విస్తృతంగా ప్రచారం చేస్తున్న సాక్షి లో ఈ బ్రేక్ కు సంబంధించి ఒక్క వార్తకూడా ఉండదు. అయితే నిన్న సోషల్ మీడియా అంతా జగన్ గురించే ప్రచారం. కారణం తెలుగు దేశం సమర్ధకులు. వారంతా కలిసి ఒక ఫోటోను విరివిగా ప్రచారం చేసి జగన్ పరువు తీశారు అని చెప్పుకోవచ్చు.
ఆ ఫోటో ప్రకారం నిన్న శుక్రవారం చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ తో కలిసి ఒక వ్యవసాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిల్ గేట్స్ చంద్రబాబు ను పొగడ్తలతో ముంచెత్తారు. మరోవైపు జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ లండన్ లో ఒక ప్రైవేట్ ఎన్జీఓ చేతుల మీదుగా ఒక పురస్కారం అందుకున్నారు.
మరి అదే శుక్రవారం జగన్ మోహన్ రెడ్డి మాత్రం నాంపల్లి సీబీఐ కోర్టులో జడ్జి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు అని ఆ ఫోటో చెబుతుంది. ఈ ఫోటో న్యూట్రల్ జనాలలో బాగా తిరిగింది. ఒక రకంగా ఇది జగన్ కు అప్రతిష్ట అనే చెప్పుకోవాలి. మరోవైపు జగన్ ఈరోజు తన పాదయాత్ర ను మళ్ళి మొదలు పెట్టారు.
Vijay Deverakonda is making another move outside cinema, and this time he is putting his…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్’) ప్రక్రియలో భాగంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు నోటీసు ఇచ్చినప్పుడు అందుకు…