
‘ఎన్టీఆర్ గారితో లక్ష్మీపార్వతికి నేను పెళ్లి చేయడమేంటి? ఆయన దగ్గర మేమందరం చిన్నపిల్లల్లా ఉండేవాళ్లం. ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడేంత అవకాశం మాకు లేదు. ఎన్టీఆర్ గారు నన్ను బాగా అభిమానించేవారు. ఓ సారి కర్నూల్ లో ఓ సభకు మేము వెళ్లాం. మాధవరెడ్డి గారు, ఇంద్రారెడ్డి గారు, నేను కింద కూర్చున్నాం. ఎన్టీఆర్ గారు వేదికపై ఉన్నారు.
చంద్రబాబు గారితో పాటు సీనియర్లు ఇద్దరు ఎన్టీఆర్ గారి చెవిలో ఏదో చెబుతుంటే, అందుకు ఆయన తల అడ్డంగా ఊపుతున్నారు. కొద్దిసేపటి తర్వాత ఎన్టీఆర్ మినహా స్టేజ్ పై నుంచి అందరూ కిందికి దిగిపోయారు. ఆ తర్వాత ‘లక్ష్మీ… పైకి రా’ అని ఎన్టీఆర్ గారు పిలవగానే, లక్ష్మీపార్వతి గారు స్టేజ్ పైకి వెళ్లారు. ‘నా జీవితంలో నాకు తోడుగా నిలబడుతుంది. నాకు కాబోయే భాగస్వామి’ అని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు.
ఎన్టీఆర్ ఆ ప్రకటన చేసే వరకు మాకు అస్సలు విషయమేమీ తెలియదు, ఒక్కసారిగా ఆ ఉదంతంతో మేమంతా కూడా షాక్ కు గురయ్యాం. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతితో తన పెళ్లి ప్రకటన అధికారికంగా చేశారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతిల పెళ్లిలో తన ప్రమేయం ఏ మాత్రం లేదని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు.
Prabhas fans may finally start getting more updates about Fauzi from this month. Mythri Naveen…
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…