
కార్పొరేట్ పదవులు కూడా గెలవలేని మీరా మమ్ములను కట్టడి చేసేది అంటూ బీజేపీ నేతలపై రెచ్చిపోయారు వెల్లంపల్లి. జగన్ ‘ఓకే’ అని ఒక్క మాట చెపితే ఏపీలో సగం బీజేపీ ఖాళీ అవుతుందంటూ హెచ్చరికలు చేసారు. మేము ఏమన్నా తక్కువ తిన్నమా అంటూ ఏపీ బీజేపీ నేతలు ప్రతిదాడికి దిగారు.
దమ్ముంటే బీజేపీ నేతలతో చర్చకు రావాలని, ఆ చర్చలతోనే ఆ వెల్లంపల్లికి బీజేపీ సత్తా ఏంటో చూపిస్తాం అంటూ సవాల్ విసిరారు ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మీకు దమ్ముంటే రండి చర్చలో కూర్చోండి ఆ చర్చలు ముగిసే లోపే ఆ వెల్లంపల్లి నోటి నుండే చెప్పిస్తాం మోధీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీకి ఓటు వెయ్యమని అంటూ రివర్స్ కౌంటర్ తో బదులిచ్చారు.
బీజేపీ నాయకుల మీద ఎప్పుడు ప్రతి విమర్శ చేయడానికి కూడా జంకే వైసీపీ నాయకులు ఇప్పుడు ఇలా ప్రశ్నించడం కొంచెం వింతగానే ఉందంటున్నారు ఏపీ ప్రజలు. అంటే వైసీపీ నాయకులకు ఏపీ భవిష్యత్తు గురించి ప్రశ్నించడానికి లేవని నోరు ఇప్పుడు లేస్తుందేంటో అంటూ చురకలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఏపీకి ప్రత్యేక హోదా అడిగే దమ్ము లేదు.,పోలవరం నిధులు సమకూర్చమనే బాధ్యత లేదు., విశాఖ రైల్వే జోన్ అడిగే సత్తా లేదు., రాజధాని అభివృద్ధికి నిధులను సమకూర్చుకునే తెలివి తేటలు లేవు.,పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను గూర్చి ఊసేలేదు… ఇలా చెప్పుకుంటూ పొతే మరెన్నో అంశాలు పెండింగ్లో ఉన్నాయి.
కానీ రాష్ట్ర సమస్యల గురించి కేంద్రాన్ని ఎప్పుడు ప్రశ్నించని వైసీపీ నేతలు తమ పార్టీపై విమర్శలు చేస్తే మాత్రం వెంటనే ప్రతి దాడికి దిగుతారా! అంటూ నోరెళ్ళబెట్టడం ఏపీ ప్రజానీకం వంతు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ నాయకులకు “బీజేపీ అంటే భయం ఉంది – రాష్ట్రం పట్ల బాధ్యత లేదు” అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు.
Ramayana, starring Ranbir Kapoor, Yash and Sai Pallavi, is one of India's anticipated upcoming films.…
The Andhra Pradesh State Election Commission has announced the schedule for MPTC and ZPTC elections,…