
అలాంటిది ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పాట లీక్ అయ్యిందంటూ యూ ట్యూబ్ లో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. మెలోడీగా సాగే ఈ పాట ఆహ్లాదకరంగా ఉండడంతో, శ్రోతలను మాయలో పడేస్తోంది. రాహుల్ స్వరంతో వీనులవిందుగా మారిన ఈ పాట నిజానికి మహేష్ సినిమాలో లీక్ అయిన పాట కాదు. యూ ట్యూబ్ లో ‘పూర్ బాయ్ రాహుల్ సిప్లిగంజ్’ పేరుతో విడుదల చేసిన ప్రైవేటు ఆల్బంలోని ఈ మెలోడీ పాటను మహేష్ “సంభవామి యుగేయుగే” పాటలోదంటూ అప్ లోడ్ చేయడం, అది కాస్త వైరల్ గా మారడం జరిగిపోయాయి.
నిజానికి 2015లోనే ఈ పాట యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ అయ్యింది. అయితే ప్రైవేటు ఆల్బం కావడంతో, కావల్సినంత ప్రజాధరణ లభించలేదు. దీంతో ఈ పాట మహేష్ సినిమాలోది అని కొత్తగా అప్ లోడ్ చేయడంతో, ఇది కాస్త పాపులర్ అయ్యింది. ప్రిన్స్ అభిమానులైతే… ఈ పాట అదిరిపోయిదంటూ హరీష్ జయరాజ్ అదిరిపోయే సంగీతాన్ని అందించారంటూ పండగ చేసుకుంటున్నారు. కానీ, అసలు వాస్తవం అది కాదు, ఇది రాహుల్ అనే సింగర్ సృష్టించిన ఓ ప్రైవేటు ఆల్బంలోని పాట మాత్రమే!
For Telugu cinema, summer is usually treated like a festival season. Schools close, families go…
North America distributor Prathyangira Cinemas, which is releasing two big-star films around the same time,…