
ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఆగష్టు 9వ తేదీన విడుదల కానున్న టీజర్ తర్వాత, 15వ తేదీన రెండవ పాటను, 23వ తేదీన మరో పాటను గానీ, ధియేటిరికల్ ట్రైలర్ ను గానీ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఒకవేళ 23న పాట విడుదలైతే, 30వ తేదీన ట్రైలర్ ను విడుదల చేస్తారని, అదే 23న ట్రైలర్ విడుదలైతే 30న మరో పాటను విడుదల చేయనున్నారని ట్రేడ్ వర్గాల టాక్.
సెప్టెంబర్ 27వ తేదీకి ముహూర్తం ఖరారు చేసుకున్న ఈ సినిమాకు ఆడియో వేడుకను నిర్వహిస్తారా? లేక నేరుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నే ఏర్పాటు చేస్తారా? అన్న విషయం ఇంకా ఖరారు కాలేదు. అయితే తెలుగు నాటతో సమానంగా కోలీవుడ్ లో కూడా స్వయంగా మహేష్ బాబు పాల్గొనే విధంగా పబ్లిసిటీని నిర్వహించబోతున్నట్లు స్పష్టమైన సమాచారం. తమిళ ప్రచారం అంతా సెప్టెంబర్ లోనే జరగనుంది.
For Congress, the November 1 rally at Delhi's Ramlila Maidan was an opportunity to show…
The Tiger Shroff firing incident appears to have changed more than just the security arrangements…