
అయినప్పటికీ మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంటుంది. మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ లపై చిత్రీకరించబోయే ఈ పాటలను విదేశాలను చిత్రీకరణ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తం అయిదు పాటలున్న ఈ ఆల్బమ్ లో టైటిల్ సాంగ్ హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. హారిస్ జయరాజ్ స్వరపరిచిన ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా పెద్ద ప్లస్ పాయింట్ లో ఒకటిగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మహేష్ బాబు కెరీర్ లోనే భారీ బడ్జెట్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు అండ్ కో నిర్మిస్తున్నారు.
ఇక టీజర్ విషయానికి వస్తే… ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావడం దాదాపుగా ఫిక్స్ అయిన విషయమే. అయితే అధికారికంగా డిక్లేర్ చేయడమే మిగిలి ఉంది. 59 సెకన్ల పాటు ఈ టీజర్ ను కట్ చేసారని, హరీస్ జయరాజ్ అందించిన సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ స్టైలిష్ గా ఉండనుందని సినీ వర్గాల నుండి లభించిన కీలక సమాచారం. ఈ టీజర్ ను తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేస్తుండడంతో, మొదటిసారిగా మహేష్ తమిళ వాయిస్ వినే అవకాశం అభిమానులకు కలగనుంది.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…