
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… తెలుగు, తమిళ భాషలకు సంబంధించి ఒకే టీజర్ ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అంటే ఈ టీజర్ లో కూడా మహేష్ బాబు డైలాగ్స్ లేకుండానే విడుదల కానుందా? అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే… అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలను అందుకోవడం సాధ్యమేనా? మొదటి టీజర్ మాదిరే రెండవ టీజర్ లోనూ ఏమీ రివీల్ చేయకపోతే, ట్రేడ్ వర్గాలలో ఎలాంటి సంకేతాలు ఉంటాయి?
ఇలా అనేకానేక ప్రశ్నలు ప్రిన్స్ ఫ్యాన్స్ మదిలో ఉత్పన్నమవుతున్నాయి. బయో టెర్రరిజం నేపధ్యంలో తెరకెక్కుతున్న కధగా చెప్తున్న ఈ “స్పైడర్”కు పోటీగా ‘జైలవకుశ’ ఉండడంతో, ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలలోనూ బజ్ క్రియేట్ చేయడం చాలా ప్రధానమైన అంశం. మరి ప్రిన్స్ డైలాగ్ లేకుండానే దర్శకుడు మురుగదాస్ కావాల్సిన హైప్ ను తీసుకువస్తారా? ఏమో…! బుధవారం నాడు ఉదయం 9 గంటలకు దీనిపై స్పష్టత రానుంది. అప్పటివరకు అభిమానుల కోసం ‘స్పైడర్’ పోస్టర్లు విడుదల కానున్నాయి.
For Congress, the November 1 rally at Delhi's Ramlila Maidan was an opportunity to show…
The Tiger Shroff firing incident appears to have changed more than just the security arrangements…