
“స్పైడర్” తర్వాత విడుదల అవుతోన్న తొలి పెద్ద సినిమా టీజర్ గా బాబీ – జూనియర్ ఎన్టీఆర్ “జైలవకుశ” నిలవనుంది. జూలై మొదటి వారంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నామని ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ’ ట్విట్టర్ ఖాతా ద్వారా నిర్మాత కళ్యాణ్ రామ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ‘స్పైడర్’ ఖాతాలో ఉన్న యూ ట్యూబ్ క్లిక్స్ రికార్డులను “జైలవకుశ” బద్దలు కొడుతుందో లేదో అన్న ఆసక్తి ట్రేడ్ వర్గాలతో పాటు, ఆయా హీరోల అభిమానుల్లోనూ నెలకొని ఉంది.
ఒకవేళ అదే జరిగితే “జైలవకుశ” పట్ల ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ఏంటో కూడా బయటపడినట్లవుతుంది. కధల పరంగా ఈ రెండు చిత్రాలు పూర్తి విభిన్నం కనుక, ‘జైలవకుశ’ చిత్ర యూనిట్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పడంలో సందేహం లేదు. జూలై 5వ తేదీన కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావచ్చు అన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి గానీ, మరికాసేపటికే అందులో వాస్తవం లేదన్న విషయం ఖరారయ్యింది. ఎప్పుడు విడుదల చేసిన రికార్డుల దుమ్ము దులుపుతాము అంటున్నారు ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్..! అవునా… కాదా..!
Dia Mirza's latest controversy began with a simple appeal for a pollution-free Diwali. But what…
గతంలో బెంగళూర్ ప్యాలస్ లో, హైద్రాబాద్ లోటస్ పాండ్ లో కూర్చుని కూడా పులివెందుల రాజకీయం నడిపించిన జగన్ ఇప్పుడు…