
శ్రీవిష్ణు చేసిన అప్పట్లో ఒకడుండేవాడు, వీరభోగవసంతరాయులు, అర్జున ఫాల్గుణ లాంటి సినిమాలు, మాస్ ఇమేజ్ తీసుకురాకపోగా ఉన్న కాస్త ఇమేజ్ ని పాడు చేసాయి. రీసెంట్ గా విడుదలయిన ‘అల్లూరి’ సినిమా కూడా.. శ్రీవిష్ణుకు ఏ మాత్రం ఉపయోగపడకుండా పోయింది.
మాస్ సినిమాలు తనకు కలిసిరావని తెలుసుకుని, శ్రీవిష్ణు తన పాత పంధాలో, బాగా కలిసొచ్చిన రొమాంటిక్ కామెడీనే నమ్ముకుని, ఈరోజు కొత్త సినిమాని ప్రారంభించాడు.
అయితే ఒక విషయం మాత్రం ఖచ్చింతం గా చెప్పచ్చు. ఇంత పోటీ లో కూడా తనకంటూ ఒక మార్కు వేసుకోవడం మామూలు విషయం కాదు. ఇది సినిమా పట్ల తనకున్న ప్రేమ, కొత్తగా ఎదో చేయాలనే తపనని శ్రీ విష్ణు లో మనం ప్రతి మూవీకీ చూడచ్చు.
ఏకె ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ నూతన చిత్రానికి, రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా, గోపిసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్రం శ్రీవిష్ణు కి మంచి విజయాన్ని అందిస్తుందని, శ్రీవిష్ణు ట్విట్టర్ మాధ్యమంలో తన అభిప్రాయాన్ని తెలియజేసారు.శ్రీవిష్ణు ప్రియ స్నేహితుడు నారా రోహిత్ ,చాలా రోజుల తరువాత బయటకొచ్చి , ఈ సినిమా పూజా కార్యక్రమంలో క్లాప్ కొట్టి, శ్రీవిష్ణుకి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఇటీవల పుంగనూరులో నామినేషన్స్ ప్రక్రియలో వైసీపీ ఎమ్మెల్సీ మిథున్ రెడ్డి ఎంత హడావుడి చేశారో, ఎంత విధ్వంసం జరిగిందో అందరూ…
Vijay Deverakonda and Rashmika Mandanna are currently promoting their latest film Ranabaali. The popular pair…