
మార్చ్ 22 న ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదలైన ఈ 18 వ సీజన్లో, ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన మరియు హోరెత్తించే మ్యాచ్లను మనం చూసాం. అయితే, ఇవాళ జరగనున్న మ్యాచ్ పై ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఆసక్తి కనపరుస్తున్నారు. హైదరాబాద్ వేదికగా SRH లక్నో తో తలపడనుంది. ఈ ఇద్దరి మధ్య పోటీ అంటే అందరికి గతేడాది జరిగిన సన్నివేశాలే గుర్తుకొస్తున్నాయి.
గతేడాది జరిగిన ఈ రెండు జట్ల పోరు లో హైదరాబాద్ జట్టు లక్నో జట్టును కనీసం కనికరం కూడా లేకుండా చితక్కొట్టేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 165 పరుగులు చేసి,హైద్రాబాద్ జట్టు ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. అయితే అప్పటికే భీభత్సమైన ఫామ్ లో ఉన్న హైదరాబాద్ జట్టు బ్యాటర్లకు అసలు ఇది ఒక స్కోరు గానే కనిపించినట్టులేదు.
మొదటి ఓవర్ నుండే హిట్టింగ్ చేస్తూ ఏకంగా 9 .4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి, ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఐపీఎల్ చరిత్ర లోనే కనీవినీ ఎరుగని ఒక సంచలనమైన బ్యాటింగ్ తో ఫాన్స్ లో జోష్ నింపారు. ఇదంతా హైదరాబాద్ జట్టు కోణం మాత్రమే, ఓడిన లక్నో టీం కు ఇది ఒక చెప్పుకోలేని ఘోర పరాభవమనే చెప్పాలి.
ఈ ఓటమి ఆ జట్టుకే కాక ఆ జట్టు కెప్టెన్ ‘కె.ఎల్.రాహుల్’ పై కూడా ప్రభావాన్ని చూపింది. ఆ మ్యాచ్ ఓటమి తరువాత లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా గ్రౌండ్ లో నే కెఎల్ రాహుల్ తో ఆవేశంగా మాట్లాడిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఓనర్ అయ్యుండి కెప్టెన్ పై సహనాన్ని కోల్పోవటం ఏంటంటూ, అభిమానులు రాహుల్ కి మద్దతుగా నిలిచారు.
ఇక, ఈ మ్యాచ్ ఫలితం ఏకంగా రాహుల్ ను లక్నో జట్టు నుండి బైటకు వచ్చేలా చేసింది అనే వాదన కూడా ఉంది. అయితే ఇప్పుడు లక్నో జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పంత్ కూడా ఈ ఐపీఎల్ తొలి మ్యాచ్ లో తన బాట్ తో, తన కెప్టెన్సీ తో ఆ జట్టు అభిమానులను నిరాశ పరిచారు. అలాగే సదరు జట్టు యాజమాన్యం నుండి అసహనాన్ని ఎదుర్కొన్నారు.
మరి ఇక్కడ చూస్కుంటే, మొదటి మ్యాచ్ కు ముందే హైదరాబాద్ జట్టు బ్యాటర్ ‘ట్రావిస్ హెడ్’ ఎలాగైనా ఈ సీజన్లో 300 కొట్టి తీరుతాం అంటూ శపధం చేసారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఈ సీజన్ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 286 రన్స్ కొట్టి, గత ఏడాది తన పేరిట నమోదైన అత్యధిక స్కోర్ 287 కు ఒక్క రన్ తక్కువతో రాజస్థాన్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు SRH బాటర్స్.
మరి ఇవాళ్టి మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గతేడాది నుండి ఊరిస్తున్న ఆ 300 స్కోరును చేరుకుంటుందా.? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే హైద్రాబాద్ సన్ రైజర్స్ టాస్ గెలిస్తే మాత్రం మొదట బ్యాటింగ్ తీసుకుని తమ 300 రన్స్ కలను నిజం చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాకాకుండా లక్నో తొలుత బ్యాటింగ్ చేస్తే SRH బాటర్స్ నిర్దేశిత స్కోర్ ఛేదన కోసం ఈ రెండు జట్ల మధ్య ఉన్న గతేడాది అత్యల్ప ఓవర్ ఛేజింగ్ రికార్డు ను బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.
అంటే ఈ మ్యాచ్ కు టాస్ కూడా అత్యంత కీలకం కానుంది అనేది తేలిపోయింది. ఏదేమైనా ఈ మ్యాచ్ SRH కు హైద్రాబాద్ హోమ్ గ్రౌండ్ కావడం, ఆ జట్టు సభ్యులంతా మంచి బ్యాటింగ్ ఫామ్ లో ఉండడం అటు లక్నో మొదటి మ్యాచ్ లోనే ఓటమిని ఎదుర్కోవడం తో ఈ మ్యాచ్ పై SRH పై చేయి సాధిస్తుంది అనే అంచనాలు మిండుగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను బద్దలు కొట్టే సత్తా లక్నో టీం కు ఉందా.? అనేది మరికొన్ని గంట్లలో తేలనుంది.
The next 24 hours could be extremely consequential in Indian politics as something big is…
The elections to the Telugu Film and TV Dancers and Dance Directors Association will not…